ఎర్ర రక్త కణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:redbloodcells.jpg|right|frame|మానవ రక్తంలో ఎర్ర రక్తకణాలు]]
 
ఎర్ర రక్త కణాలు (Red blood cellcells) [[రక్తం]]లో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే రక్తకణాలు. ఒక మిల్లీలీటరు రక్తంలో ఎర్ర రక్త కణాలు ఐదు మిలియన్ల వరకు ఉంటాయి
 
మన రక్తంలో ప్రతి ఒక్క తెల్ల కణానికి జవాబుగా దరిదాపు 600 ఎర్ర కణాలు ఉంటాయి. నిర్ధిష్టమైన ఆకారం లేని తెల్ల కణం కైవారం 10-20 మైక్రానులు ఉంటే గుండ్రటి బిళ్లలులా ఉన్న ఎర్రకణం వ్యాసం 7 మైక్రానులు ఉంటుంది. (ఒక మైక్రాను అంటే మీటరులో మిలియనవ వంతు!) ఎర్ర కణాలు ద్విపుటాకారపు (bi-concave) ఆకారంలో ఉంటాయి; అనగా, మధ్యలో చిన్న లొత్త ఉంటుంది.
 
ఒకొక్క ఎర్ర కణంలో సుమారు 270 మిలియన్ల హిమోగ్లోబిన్ బణువులు ఉంటాయి. ఒకొక్క బణువు ( molecule) ఎన్నో అణువుల ( atoms) సముదాయం. ఒక బణువు ఎంత పెద్దదో చెప్పాలంటే దాని బణు భారం (molecular mass) చెబుతాం. ఒక ఉదజని బణువులో రెండు ఉదజని అణువులు ఉంటాయి; దాని బణు భారం 2. ఒక ఆమ్లజని బణువులో రెండు ఆమ్లజని అణువులు ఉంటాయి; దాని బణు భారం 32. అదే విధంగా హిమోగ్లోబిన్ బణు భారం 64,000 డాల్టనులు ఉంటుంది. అనగా, ఒక [[మోల్]] హిమోగ్లోబిన్ ఉరమరగా 64,000 గ్రాములు తూగుతుంది.
 
ఒకొక్క హిమోగ్లోబిన్ బణువు కేవలం నాలుగు ఆమ్లజని అణువులని ఊపిరితిత్తుల దగ్గర సంగ్రహించి శరీరంలోని జీవకణాలకి అందజేస్తుంది. ఎర్ర కణాలు వాటి జీవితకాలంలో మనకి విశేషమైన సేవ చేస్తాయి. ఇవి పుట్టిన దగ్గరనుండి గిట్టే దాకా సుమారు 75,000 సార్లు ఊపిరితిత్తుల నుండి జీవకణాలకి ఆమ్లజనిని అందజేసి, సుమారు నాలుగు నెలలపాటు విశ్రాంతి లేకుండా పని చేసి చచ్చిపోతాయి.
"https://te.wikipedia.org/wiki/ఎర్ర_రక్త_కణం" నుండి వెలికితీశారు