క్రియ (వ్యాకరణం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
కాబట్టి మనం ఇంచుక్ బదులు ఇల్లుక్ చేర్చడం ద్వారా సకర్మక ధాతువుల్ని అకర్మక ధాతువులుగా మార్చడానికి తెలుగుభాష అవకాశం కల్పిస్తోంది. దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు.
 
:ఇంచుక్ = చేయు
:ఇల్లుక్ = అగు
 
ఈ మార్గంలో కల్పించదగిన కొన్ని పదాలు:
 
:సన్నగిల్లు - సన్నగించు (సన్నగా అయ్యేలా చేయు)
:పరిఢవించు - పరిఢవిల్లు
:తొందఱించు - తొందఱిల్లు మొదలైనవి.
 
"ఇంచుక్, ఇల్లుక్" లని తెలివిగా పదాలకు చేర్చడం ద్వారా అంతులేనన్ని కొత్త క్రియాధాతువుల కల్పనకు తెలుగుభాష అవకాశమిస్తోంది. రెండూ ముఖ్యమైనవే. "ఇల్లుక్" చేర్పు తెలుగు నుడికారానికి స్వాభావికం కాని కర్మార్థక (passive voice) ప్రయోగాల ఆవశ్యకతని గణనీయంగా తగ్గిస్తుంది.
 
:(సవరిత వాడుక - modified usage):- ఆ వేగుతో అతను హెచ్చరిల్లాడు (హెచ్చరించబడ్డాడు- మేలుకున్నాడు. He got alert with the mail)
:(నిష్పన్న వాడుక - coined usage):- భవిష్యత్తులో వంద డాలర్ల లోపలే కంప్యూటర్లు అందుబాటిల్లుతాయి. (అందుబాటులోకి వస్తాయి-దొరుకుతాయి. Future PCS could be accessed/accessible at just $ 100)
 
ఇక్కడ కొన్ని నియమాలు ప్రవర్తిస్తాయి. మనం కల్పించే పదాల శ్రావ్యతని బట్టి వాటిని పాటించడమో మానుకోవడమో చెయ్యొచ్చు.
 
:ఉర్దూ పదాలకు "ఇంచుక్/ఇల్లుక్" చేర్చడానికి ముందు ఆ పదాల చివర "ఆయ్" చేరుతుంది.
::ఉడ్ (ఎగరడం) - ఉడ్ + ఆయ్ = ఉడాయ్ + ఇంచుక్ = ఉడాయించు (to decamp)
::బనా (తయారు చెయ్యడం) - బనా + య్ = బనాయ్ + ఇంచుక్ = బనాయించు (to frame a criminal charge)
 
సంస్కృత పదాలకు ఇంచుక్ చేరే విధానం మనకందరికీ కొద్దో గొప్పో తెలుసు కనుక సవిస్తరంగా ఆ జోలికి పోను. విశేష వివరణలు కావాల్సినవారు చిన్నయసూరి రచించిన బాలవ్యాకరణంలోని క్రియాపరిచ్ఛేదం చదవండి. అయితే ప్రస్తుతం ఈ మార్గంలో కూడా అవసరమైన పదాల కల్పన జరగడంలేదు. దీనికి సామాజిక కారణాలున్నాయి. సంస్కృత భాషా పరిజ్ఞానం చాలావరకు బ్రాహ్మణులకే పరిమితమైనది. ప్రస్తుతం మన తెలుగు బ్రాహ్మణులకు తెలుగే సరిగా రాదు. సంస్కృతం సంగతి చెప్పనక్కరలేదు. ఇలాంటి పరిస్థితిలో వారు ఎవరికీ ఏమీ నేర్పే సావకాశం లేదు. మిగతావారికేమో సంస్కృతంతో సంపర్కం ఎప్పుడూ లేదు. We are apparently living in age of cultural disconnect with our history and past. ఏతావతా మనం ఇంగ్లీషు పదాలకు దీటైన దేశిపదాల్ని పట్టుకోవడంలో విఫలమౌతున్న దశాపరిణామం గోచరిస్తోంది. నేను కొంత ప్రదర్శిస్తాను. తరువాత ఎవరైనా ప్రయత్నించండి.
:పుస్తకం (book) - పుస్తకించు (booking) వీణ్ణి జేబుదొంగగా పుస్తకించండి. (నమోదు చెయ్యండి. Book him as a pickpocket)
:మార్గం (route) - మార్గించు (routing) పేపాల్ ద్వారా ఈ చెల్లింపుని మార్గించాను (మార్గం కల్పించాను) - పేపాల్ పద్ధతిలో (మార్గంలో) ఈ చెల్లింపుని పంపించాను. (I routed this payment through Paypal)
"ఇంచుక్" ఉపయోగించి ప్రసిద్ధ సంస్కృత వ్యక్తుల/దేవతల పేర్లని కూడా క్రియాధాతువులుగా మార్చొచ్చు.అలాంటివి ఒకటిరెండు ఇప్పటికే సుప్రసిద్ధం. ఉదా: భీష్ముడు - భీష్మించుట, శివాలెత్తుట మొ. మఱికొన్నిటిక్కూడా అవకాశముంది. కాని అలాంటి క్రియాధాతువులు అర్థం కావాలంటే వారి గుణగణాలు కొంచెమైనా తెలియాలి.
 
విక్రమార్కించు = పట్టువదలకపోవు
"ఇంచుక్" ఉపయోగించి ప్రసిద్ధ సంస్కృత వ్యక్తుల/దేవతల పేర్లని కూడా క్రియాధాతువులుగా మార్చొచ్చు.అలాంటివి ఒకటిరెండు ఇప్పటికే సుప్రసిద్ధం. ఉదా: భీష్ముడు - భీష్మించుట, శివాలెత్తుట మొ. మఱికొన్నిటిక్కూడా అవకాశముంది. కాని అలాంటి క్రియాధాతువులు అర్థం కావాలంటే వారి గుణగణాలు కొంచెమైనా తెలియాలి.
జయచంద్రించు = విదేశీయులకు తోడ్పడు
 
కుంభకర్ణించు = లోకోత్తరంగా నిద్రపోవు మొదలైనవి.
::విక్రమార్కించు = పట్టువదలకపోవు
::జయచంద్రించు = విదేశీయులకు తోడ్పడు
::కుంభకర్ణించు = లోకోత్తరంగా నిద్రపోవు మొదలైనవి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/క్రియ_(వ్యాకరణం)" నుండి వెలికితీశారు