శివ (1989 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (5), కి → కి (6), గా → గా , పోయినది. → పోయింది., → (6), ( using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 12:
టైటిల్ రోల్ ని [[అక్కినేని నాగార్జున]] పోషించిన '''శివ''' చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. [[అమల]] కథానాయికగా, [[రఘువరన్]] ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా [[తనికెళ్ళ భరణి]] నటించారు. భరణి కథ కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. [[ఇళయరాజా]] స్వరాలని కూర్చారు. [[రాంగోపాల్ వర్మ]]కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. [[తమిళం]]లో ఉదయంగా అనువదించబడగా, [[హిందీ]]లో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం [[సికింద్రాబాద్]] లోని కీస్ ఉన్నత పాఠశాలది.
==కథ==
(కల్పిత) వి ఏ ఎస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్సెస్ కళాశాల ఎదురుగా గణేశ్ ([[తనికెళ్ళ భరణి]]) తన అనుచరులతో ఎదురుచూస్తున్న సన్నివేశంతో చిత్రం మొదలవుతుంది. జెడి (జెడి చక్రవర్తి) సైగతో గణేశ్ బృందం ఒక విద్యార్థిని దారుణంగా హతమారుస్తారు.
 
జెడి విద్యార్థి నాయకుడని, కాలేజీలో ఎదురు లేని మనిషి అని, ఆ కళాశాల స్టూడెంట్ యూనియన్ కి ఏకపక్ష ప్రెసిడెంట్ అని తెలుస్తుంది. గణేష్ ద్వారా జెడికి ఆ ప్రాంతంపై గుత్తాధిపత్యం చలాయిస్తున్న భవానీ ([[రఘువరన్]]) తో పరిచయం ఉంటుంది. విద్యార్థులతో ఉన్న ఈ సంబంధంతోనే భవానీ రాజకీయ నాయకుడైన మాచిరాజు ([[కోట శ్రీనివాస రావు]]) యొక్క రాజకీయ మరియు నేర కార్యకలాపాలకి విద్యార్థులని ఉపయోగించుకొంటూ మాచిరాజుకు వెన్నుదన్నుగా ఉంటాడు.
"https://te.wikipedia.org/wiki/శివ_(1989_సినిమా)" నుండి వెలికితీశారు