బిజినెస్ మేన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
ఆర్. ఆర్. మూవీ మేకర్స్ పతాకం పై ఆర్. ఆర్. వెంకట్ నిర్మించిన చిత్రం '''''[[బిజినెస్ మేన్]]'''''. [[పూరీ జగన్నాధ్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో[[చిత్రం]]<nowiki/>లో [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు|మహేశ్ ‌బాబు]], [[కాజల్ అగర్వాల్]], [[ప్రకాశ్ రాజ్]], [[నాజర్ (నటుడు)|నాజర్]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం జనవరి 13, 2012 న భారీ యెత్తున విడుదలై సంచలనాత్మక [[విజయం]] సాధించింది.
 
==కథ==
ముంబై నగర పోలీస్ కమిషనర్ భరద్వాజ్ ([[నాజర్ (నటుడు)|నాజర్]]) సిటీలో మాఫియాని అంతమొందించామని మీడియాకి ధృవీకరించిన తర్వాత ముంబైలో విజయ్ సూర్య ([[ఘట్టమనేని మహేశ్ బాబు]]) అనే యువకుడు ముంబైలోకి అడుగుపెడతాడు. ఆ నగరంలోని ధారవి ప్రాంతంలో ఉన్న తన స్నేహితుడు (బ్రహ్మాజీ) తన ఇంటికి సూర్యని తీసుకెళ్తాడు. ఇదే ముంబైలో ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని తన [[స్నేహితుడు]] అన్న మాటలకు బదులుగా సూర్య తను ముంబైలో పెద్ద డానవ్వాలని, ముంబైని తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజల్లో మాఫియా భయాన్ని తిరిగి నిద్రలేపడానికి వచ్చానంటాడు. అప్పుడు లాలూ (షయాజీ షిండే) అని ఇబ్బందుల్లో ఉన్న ఓ రాజకీయ నాయకుడికి సహాయం చేస్తానంటాడు. జాఇలులో ఉన్న లాలూ విరోధిని తను కొత్తగా ఏర్పరుచుకున్న అనుచరులల్లో జైలులో ఉన్న ఒకరితో చంపించేసి లాలూని తన స్నేహితుడిని చేసుకుని రాజకీయ బలం పెంచుకోవడం మొదలుపెడతాడు. ముంబైలో ఉన్న నేరస్థులు, [[రౌడీ]]లను తన అనుచరులుగా మార్చుకుంటాడు. ముంబైపై పట్టు సాధిస్తూ మెల్లమెల్లగా సూర్య భాయ్ అనే పేరుతో [[ముంబై]] ప్రజల్లో ప్రముఖుడు, అదే ప్రజలకు భయాన్ని కలిగిస్తాడు.
 
ఇంతలో భరద్వాజ్ చేతుల్లోనుంచి తప్పించుకోడానికి భరద్వాజ్ కూతురు చిత్ర ([[కాజల్ అగర్వాల్]])ని వాడుకోవాలనుకుంటాడు సూర్య. పెయింటర్ ఐన చిత్రని సూర్య ప్రేమిస్తున్నట్టు నటించి తనని ప్రేమలో పడేస్తాడు. కానీ సూర్య ప్రేమ ఓ నటన అని చిత్ర తెలుసుకునే సమయానికి సూర్య తనని నిజాయితీగా ప్రేమిస్తుంటాడు. ఆ విషయం తనకి తెలిసేలా చేసినా తను నమ్మదౌ కాబట్టి చిత్రను ఎలాగైన తనని తిరిగి ప్రేమించేలా చెయ్యాలని ప్రయత్నిస్తుంటాడు. ఒక వ్యాపారవేత్తగా, డన్ గా అంచెలంచెలుగా జాతీయ స్థాయిలో ఎదిగిన సూర్య లాలూతో స్నేహం, రాజకీయ బలాలను పెంచుకుంటాడు. సూర్య ఎక్స్పోర్ట్స్ & ఇంపోర్ట్స్ అనే కంపెనీ పెట్టి దాని ద్వారా తన అక్రమ వ్యాపారాలను నడుపుతుంటాడు. భారతదేశం వ్యాప్తంగా సూర్య భాయ్ అంటే ఓ వ్యక్తిలా కాక ఓ బ్రాండ్ అనిపించుకునేలా తన అక్రమ వ్యాపారాలను నలుమూలలా విస్తరింపజేస్తాడు. ప్రతీ నగరంలో, ప్రతీ టౌనులో, ప్రతీ ఊరిలో సూర్య ఎక్స్పోర్ట్స్ & ఇంపోర్ట్స్ బ్రాంచులను స్థాపిస్తాడు. ఆయా ప్రాంతాల్లో జరిగే కాంట్రాక్ట్స్ అన్నింటిపైన 2% టాక్స్ బలవంతంగానైన వసూలు చెయ్యమని అక్కడి లోకల్ గూండా, రౌడీలను నియమించుకుంటాడు సూర్య. దీనివల్ల కోటీశ్వరుడైన సూర్య తను స్థాపించిన బిజినెస్ బ్యాంక్ ఇనాగురేషన్ ఫంక్షనులో భరద్వాజ్ పక్కన కూర్చుని తన నిజమైన ఆంతర్యాన్ని చెప్తాడు. తనకి యుద్ధంలో తప్ప మంచి,చెడులతో పనిలేదని, తన పనులవల్ల ఇండియాలో క్రైం రేట్ తగ్గిందని, భారతదేశంలో మాఫియాని అంతమించి పేదలకు సాయం చెయ్యడమే తన ఈ పనుల అంతరార్థమని చెప్పేస్తాడు.
"https://te.wikipedia.org/wiki/బిజినెస్_మేన్" నుండి వెలికితీశారు