డిస్కు చెక్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
అందువలన ఎక్కువ పీడనం మరియు వేగంతో ఒక వ్యవస్థలో ద్రవం లేదా వాయువు ప్రవహిస్తున్నపుడు, ద్రవాన్ని లేదా వాయువును తోడుయంత్రం /పంపు ఆగినపుడు ప్రవాహం వెనక్కి ప్రవహించడం కుండా ఈ ఏకదిశ కవా ట లు నిరోధించును. పంపుల ద్వారా నదులు,కాలువల నుండి నీటిని ఒవర్ హెడ్ ట్యాంకులను నీరును తోడునపుడు, పంపు ఆగిన,ఈ ఏకదిశ కవాటం లేనిచో ఒవర్ హెడ్ ట్యాంకులోని నీరంతా మరల కిందికి వచ్చును. బావుల నుండి, కాలువల నుండి నీటిని తోడు పంపుల సక్షను పైపు కింది భాగంలో వుండు ఫూట్ వాల్వ్ కూడా ఒకరకమైన ఏకదిశ కవాటమే.
==డిస్కు చెక్ వాల్వు నిర్మాణం==
డిస్కు ఏకముఖ కవాటం సరళమైన, సాదా ఆకృతి కల్గిన కవాటం. మిగతా ఏకముఖ కవాటాల కన్నా తక్కువ స్థాలాన్ని ఆక్రమిస్తుంది. [[బటరుఫ్లై వాల్వు]] లా చక్కగా పైపుల యొక్క రెండు ఫ్లాంజిల మధ్య ఇమిడి పోతుంది<ref>{{citeweb|url=https://www.forbesmarshall.com/fm_micro/Products5.aspx?MidP=159&Mname=Steam%20Generation&s1id=577&s1name=Valves%20&s2id=214&s2name=Disc%20Check%20Valves%20(Spring%20Loaded)|title=Disc Check Valves (Spring Loaded)|publisher=forbesmarshall.com|accessdate=09-03-2018}}</ref>.డిస్కు చెక్ వాల్వుకు ప్రత్యేకంగా ఫ్లాంజిలు అవసరం లేదు.వాల్వు బాడీ గుండ్రంగా తక్కువ మందంతో వుండటం వలన ఇదే సైజు ఇతర వాల్వులకన్న తక్కువ బరువు కల్గివుండును. వాల్వు మొత్తం స్టెయిన్ లెస్ స్టీలు (తుప్పుపట్టని ఉక్కు)తో చెయ్యడం వలన ఎక్కువ కాలం ఎటువంటి మరమత్తులు లేకుండా పనిచేయును.వాల్వు ను అన్ని రకాల స్థితులలో (position) వాడవచ్చు అనగా క్షితిజసమాంతరంగా,నిలువుగా మరియు ఏటవాలుగా కూడా వాడవచ్చును.
 
'''డిస్కు చెక్ వాల్వులోని ప్రధాన భాగాలు '''
పంక్తి 26:
===స్ప్రింగు రిటైనరు===
స్ప్రింగు రిటైనరు కూడా స్టెయిన్‌లెస్ స్టీలుతో చెయ్యబడివుండును. ఈ స్ప్రింగు రిటైనరుమద్యలో వాల్వు సైజుకు సరిపడా రంధ్రం వుండును. ఇది స్ప్రింగును బలంగా డిస్కును నొక్కడం వలన, డిస్కు కవాట ప్రవాహ రంధ్రాన్ని మూసివుంచును.
 
==పనిచేయు విధానం==
మామూలు స్థితిలో కవాట బిళ్ళపై స్ప్రింగు కలుగచేయు వత్తిడి వలన బిళ్ళ బలంగా వాల్వు రంధ్రాన్ని మూసిఉంచును. వాల్వులోని ప్రవాహం బిల్లపై కలుగచేయు తోపుడు శక్తి స్ప్రింగు కలుగ చేయు వత్తిడి లేదా బలంకన్న ఎక్కువ అయినపుడు బిళ్ళ వెనక్కి తొయ్యబడి ప్రవాహం బయటికి ప్రవహించడం మొదలగును.ప్రవాహం ఆగినపుడు,స్ప్రింగు వెంటనే డిస్కును ముందుకు నెట్టి కవాట రంధ్రాన్ని మూయును,వెనక్కి మళ్ళిన ప్రవాహం కూడా బిళ్ళపై పీడనం కల్గించడం వలన బిళ్ళ మరింత గట్టిగా కవాటపీఠంను మూసి వుంచడం వలన ప్రవాహం వెనక్కి ప్రవాహించ కుండా నిరోధించ బడును.మరల పైపులో ప్రవాహం మొదలై బిళ్ళను వెనక్కి తొయ్యడం వలన కవాట రంధ్రం మరియు డిస్కు మధ్య ఖాళి ఏర్పడం వలన మళ్ళి వాల్వు ద్వారా ప్రవాహం కొనసాగుతుంది.
"https://te.wikipedia.org/wiki/డిస్కు_చెక్_వాల్వు" నుండి వెలికితీశారు