ఉప్పు సత్యాగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

17 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
== ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఆంధ్రుల పాత్ర ==
 
దండి మార్చ్‌లో మహాత్ముడితో పాటు 78 మంది అనుచరులు పాల్గొన్నారు. http://www.gandhiashramsevagram.org ప్రకారం ఆంధ్ర ప్రాంతం నుంచి దండి మార్చిలో గాంధీతో పాటు నడిచిన ఏకైక తెలుగు వ్యక్తి [[ఎర్నేని సుబ్రమణ్యం]] . తర్వాత కాలంలో ఆయన గాంధీ సిద్ధాంతాలతో కొమరవోలులో ఒక ఆశ్రమాన్ని స్థాపించారు.
 
నెల్లూరులో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించిన [[దండు నారాయణరాజు]]ను నాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో ఆయన అక్కడే మరణించారు.
ఉప్పు సత్యాగ్రహం సమయంలోనే 'కవిరాజు' [[త్రిపురనేని రామస్వామి చౌదరి]] ''వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెల్పుడి'' అనే గేయకవితను రాశారు.
 
[[మాక్సిం గోర్కీ]] రాసిన రష్యన్ నవల 'ది మదర్'ను 'అమ్మ' పేరుతో తెలుగులోకి అనువదించిన [[క్రొవ్విడి లింగరాజు]] ఈ ఉద్యమ సమయంలోనే దేశ ద్రోహం నేరంపై జైలుకెళ్లారు.
 
[[బ్రహ్మాజోశ్యుల సుబ్రమణ్యం]] సీతానగర ఆశ్రమాన్ని స్థాపించారు. దీన్నే 'ఆంధ్రా దండి'గా పిలుస్తారు.
 
ఉప్పు సత్యాగ్రహం సందర్భంలోనే కేంద్ర శాసన సభకు [[రామదాసు పంతులు]], శాసన మండలి సభ్యత్వానికి [[స్వామి వెంకటాచలం]] రాజీనామాలు చేశారు.
 
ఉప్పు చట్టాలను ఉల్లఘించి [[బులుసు సాంబమూర్తి]] , [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] ( మాలపల్లి నవల రచయిత), [[ఖాసా సుబ్బారావు]] లాఠీ దెబ్బలు తిన్నారు.
40

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2312481" నుండి వెలికితీశారు