అక్కినేని నాగ చైతన్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
నాగ చైతన్య నటించిన మొదటి సినిమా [[దిల్ రాజు]] నిర్మాణంలో వాసు వర్మ [[దర్శకత్వం]]లో వచ్చిన [[జోష్]]. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటి రాధ కూతురు కార్తీక నటిగా పరిచయమైంది. ఈ సినిమా ఆశించదగ్గ విజయం సాధించనప్పటికీ, చైతన్యకు ఉత్తమ నూతన నటుడిగా [[ఫిలింఫేర్]] మరియ, [[నంది పురస్కారాలు|నంది]] అవార్డులను పొందాడు. కానీ 2010లో తను అతిథి పాత్రలో నటించిన విన్నైతాండి వరువాయా సినిమా యొక్క [[తెలుగు]] పునః నిర్మాణం ఐన [[ఏ మాయ చేశావే]] చైతన్యకు మొదటి భారీ విజయాన్ని అందించింది. గౌతం మీనన్ దర్శకత్వంలో [[సమంత]] కథానాయికగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రంలో చైతన్య తన నటనకు విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. నేటికీ తెలుగు సినిమాల్లోని ఎన్నో క్లాసిక్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలిచిపోయింది. ఈ సినిమాకి చైతన్యకు ఉత్తమ నటుడికి గాను నాటి ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
 
ఆ తర్వాత 2011లో [[సుకుమార్]] దర్శకత్వంలో [[100% లవ్]] సినిమాలో నటించాడు. ఇందులో [[తమన్నా]] [[కథానాయిక]]. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. కానీ ఆ తర్వాత అజయ్ భుయాన్ దర్శకత్వంలో [[కాజల్ అగర్వాల్]] కథానాయికగా తెరకెక్కిన తన చిత్రం [[దడ]], వివేక్ కృష్ణ దర్శకత్వంలో [[అమలాపాల్]] కథానాయికగా తెరకెక్కిన బెజవాడ సినిమాలు పరాజయాన్ని చవిచూసాయి.నాగ చైతన్య దేవ కట్ట దర్శకత్వంలో సమంత సరసన ఆటోనగర్ సూర్య, కిషోర్ పార్థాసాని దర్శకత్వంలో [[సునీల్]], తమన్నా, ఆండ్రియా సరసన తడాఖా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మనం, వీరూ పోట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాల్లో నటించాడు. వాటిలో చెప్పుకోదగ్గ చిత్రం 'మనం'. ఈ చిత్రంలో స్వర్గీయ [[అక్కినేని నాగేశ్వరరావు]] గారు నటించడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే, ఈ చిత్రం పూర్తి కాకుండానే, ఎ.ఎన్.ఆర్ చనిపోవడంతో, 'మనం' సినిమా అంచనాలకు మించి, బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టించింది.ఆ తర్వాత 2014 చివర్లో 'ఒక లైలా కోసం'తో మరొక విజయాన్ని తన ఖాతా లో వేసుకున్నాడు.2015 లో [[సుధీర్ వర్మ]] దర్శకత్వం లో '[[దోచేయ్]]' అనే సినిమా చేసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.2016 లో మలయాళం రీమేక్ అయిన 'ప్రేమమ్' సినిమా తో మరొక విజయాన్ని అందుకున్నాడు.ఆ వెంటనే [[గౌతమ్ మీనన్]] దర్శకత్వంలో 'సాహసమే శ్వాసగా సాగిపో'అనే చిత్రం లో నటించి ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు.2017 లో 'రారండోయ్ వేడుక చూద్దాం'తో మళ్ళీ ఘన విజయం సాధించింది.
 
==వ్యక్తిగత జీవితం==