బేలూరు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 69:
== ఆలయ సముదాయం ==
[[Image:BelurElephants.jpg|thumb|right|జగతి వేదిక మీద ఆలయ పీఠం మొదటి భాగంపై ఏనుగుల శిల్పాలు]]
ఈ ఆలయ సముదాయంలో ప్రధానాలయం కేశవాలయం. ఈ కేశవాలయానికి చుట్టూ రంగనాయకి, కప్పే చేన్నగరాయ ఆలయాలు ఉన్నాయి. చెన్నకేశవాలయంలో రోజూ పూజాదికాలు నిర్వహిస్తారు. ఇక్కడ [[ఆంజనేయస్వామి]], [[నరసింహస్వామి]] విగ్రహాలను చూడవచ్చు. ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హొయసలుల రాజముద్ర కనిపిస్తుంది. ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సబ్బురాతి (Chloritic Schist ) తో నిర్మించారు. ఇది తేలిక అకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ శిల సబ్బు వలె అతి మెత్తగా ఉండి, కావలసిన తీరుగా మలచడానికి అనువుగా ఉంటుదట. అందుకే ఈ దేవాలయంపై గల శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి, అద్భుత [[అందము|సౌందర్యం]]<nowiki/>తో అలరారుతాయి. దేవాలయ గోడలపై, పై కప్పు భాగంలో, వివిధ రకాలైన పక్షులు, జంతువులు, లతలు, వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల [[శిల్పాలు]] ఆకట్టుకుంటాయి. దర్పణ సుందరి, భస్మ మోహిని అనునవి చెప్పుకోదగిన ఆకర్షణీయ శిల్పాలలో కొన్ని. [[ఆలయం]] బయట నలభై రెండడుగుల ధ్వజస్తంభం ఉంది. దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఒక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది. రాజగోపురానికి కుడివైపు పుష్కరిణి ఉంది. నేటికీ భక్తులు ఉపయోగిస్తుంటారు. హొయసల శైలి కట్టడాలకు ఈ ఆలయం ఓ మచ్చుతునక. [[శ్రావణబెళగొలా]], [[హళేబీడు]]తో పాటు బేలూరును కూడా ప్రపంచ వారసత్వ సంపదగా [[యునెస్కో]] గుర్తించింది.
<!--[[File:belur statue.jpg|thumb|300px|right|యువతి శిల్పం]]--->
 
"https://te.wikipedia.org/wiki/బేలూరు" నుండి వెలికితీశారు