మంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
 
=== మంగళూరు నగర బస్సు రవాణా వ్యవస్థ ===
మంగళూరు నగర రవాణా వ్యవస్థ అంతా పైవేటు బస్సుల రూపంలో చాలా వరకు పైవేటు రంగంలో ఉంది. నగరములోను, నగర పొలి మేరలలో చాలా గమ్యస్థానాలకు ప్రైవేటు బస్సులు నగర నడి బొడ్డైన టౌను హాలు వద్ద నున్న స్టేట్ బ్యాంకు నుండి నడుస్తాయి. నగరము దాటి బయటి ఊళ్ళకు కూడా బస్సులు ఇక్కడ నుండే బయలు దేరుతాయి. నగరాన్ని దాటి దక్షిణ కన్నడ జిల్లాలోని, మరియు పొరుగు జిల్లాలలోని గమ్యస్థానాలకు వెళ్ళే బస్సులు రెండు రకాలు: ప్యాసింజర్ బస్సులు, ఎక్స్‌‌ప్రెస్‌‌ బస్సులు. ప్యాసింజర్ సర్వీసు ప్రైవేటు బస్సులు సాధారణంగా మార్గమధ్యంలో వచ్చే అన్ని గ్రామాలలోని ప్రధాన కూడళ్ళలో నిలుస్తాయి. రెండు పట్టణాలు లేదా నగరాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ బస్సులు సాధారణంగా రెండు లేదా మూడు మార్గమధ్య పట్టణాలలో నిలుస్తాయి ( ఉదాహరణకు మంగళూరు నుండి [[ఉడిపి]] వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌‌ బస్సు [[మంగళూరు]] విడిచి పెట్టాక ఉడిపి చేరే ముందు సూరత్కల్‌, పడుబిద్రి, కాపు అనే గ్రామాలలో మాత్రమే నిలుస్తుంది.
 
[[ఆటో రిక్షా]] ఇంకో రకమైన పబ్లిక్‌ రవాణా వ్యవస్థ. ఇక్కడ ఆటో లకు ఇంజన్లు వెనుక భాగంలో అమర్చబడి, తక్కువ శబ్దం చేస్తాయి. రెండు కి.మి. వెళ్ళడానికి సుమారుగా 11 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆటో రిక్షాలన్నింటిలో బిల్లింగ్ మీటర్లు అమర్చారు, అందువల్ల ఎంత పైకం చెల్లించాలో ఆ మీటరు తెలియజేస్తుంది. కాని రాత్రి పూట (రాత్రి 9 గంటలనుండి తెల్లవారు జాము 6 గంటలవరకు) 1.5 శాతం మీటరు రీడింగ్‌ పై పైకం వసూలు చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/మంగళూరు" నుండి వెలికితీశారు