కోరుట్ల: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రభుత్వ ఉత్తర్వుల లంకెలు కూర్పు చేసాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
కోరుట్ల బస్‌స్టాండుకు 2 కి.మీ. దూరంలో కోరుట్ల వాగు (సాయిరాం నది) వడ్డున [[సాయిబాబా]] గుడి కట్టారు. 20 ఎకరాల స్థలంలో కట్టబడిన ఈ అందమైన మందిరాన్ని అక్కడ రెండవ షిరిడి అంటారు. షిరిడిసాయి పుణ్యతిథినాడు వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి సాయిబాబాను దర్శించుకొంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక [[గ్రంథాలయం]], ఫంక్షన్ హాల్, ధర్మశాల, ధునిశాల, అర్చకుల గృహాలు, ఇతర నిర్వాహక భవనాలు ఉన్నాయి.
 
కోరుట్లకు 5 కి.మీ. దూరంలో [[నాగులపేట]] గ్రామం వద్ద పెద్ద '''[[సైఫన్]]''' (ఆసియాలో రెండవ పెద్దది కావచ్చును <ref name="korutlaweb"/>) ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ కోరుట్ల వాగును క్రాస్ చేయడానికి వీలుగా అండర్‌గ్రౌండ్ కల్వర్ట్ నిర్మించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువ నీరు కోరుట్ల వాగులు లంబంగా ప్రవహించి సైఫన్ ద్వారా బయలువెళుతుంది. 1953-1973లో కట్టబడిన ఈ సైఫన్ విశిష్టమైన డిజైను చేసిన ఇంజినీరు పేరుమీద దీనిని "పి.ఎస్.రామకృష్ణరాజు సైఫన్" అంటారు.
 
కోరుట్లకు 7 కి.మీ. దూరంలో [[పైడిమడుగు]] వద్ద పెద్ద [[మర్రి]] చెట్టు ఉంది. ఈ చెట్టు 7 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇది 200 సంవత్సరాల పైబడిన వృక్షమని అంటారు.
"https://te.wikipedia.org/wiki/కోరుట్ల" నుండి వెలికితీశారు