కోరుట్ల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
== చరిత్ర ==
ఇంతకుముందు ఈ వూరి పేరు "కొరవట్టు" లేదా "కొరవట్లు" అనీ, నిజాం పాలన కాలంలో "కోరుట్ల"గా రూపాంతరం చెందిందనీ అంటారు. కోరుట్ల కోనేరులో క్రీ.శ.1042-1068 కాలంనాటి శిలాశాసనం లభించింది.<ref name="korutlaweb">[http://korutla.com/History.htm కోరుట్ల వెబ్‌సైటులోని సమాచారం ఆధారంగా]</ref>. దీని ప్రకారం కోరుట్లకు వేయి సంవత్సరాల పైబడి చరిత్ర ఉందని తెలుస్తుంది. [[జైనులు]], [[కళ్యాణి చాళుక్యులు]], [[వేములవాడ చాళుక్యులు]], [[రాష్ట్రకూటులు]] ఈ ప్రాంతాన్ని వివిధ దశలలో పాలించారు.
 
ఈ పట్టణం కోట చారిత్రికంగా ఆరు బురుజుల మధ్య నిర్మించబడిందని అంటారు. వాటిలో ఐదు బురుజులు ఇప్పటికీ ఉన్నాయి. ఈ బురుజులను కలిపే పెద్ద గోడ ఉండేది. ఆ గోడపై ఒక కారు వెళ్ళవచ్చును. గోడ వెలుపల మరింత రక్షణ కోసం ఒక కందకం ఉండేది. ఆప్రాంతం ఇప్పటికీ "కాల్వగడ్డ" అని పిలువబడుతుంది. కోట మధ్య ఆవరణలో రాతి గట్టులతో త్రవ్వబడిన ఒక కోనేరు ఉంది. అక్కడి వెంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి మందిరాలు ఇప్పటికీ ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/కోరుట్ల" నుండి వెలికితీశారు