కల్లూరి విశాలాక్షమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==జీవిత విశేషాలు==
ఈమె [[వికారి]] నామ సంవత్సర [[మాఘ శుద్ధ త్రయోదశి]]న తన మాతామహుల యింట [[నడుపూడి]] గ్రామంలో జన్మించింది. తండ్రి [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] కాశీయాత్ర చేసిన పిదప ఈమె జన్మించింది కనుక ఆయన ఈమెకు విశాలాక్షి అనే నామకరణం చేశాడు. ఈమె ప్రైమరీ విద్యకంటే ఎక్కువ చదువలేదు. వివాహానంతరం శ్రీపతి భాస్కరశాస్త్రి వద్ద ఆంధ్రనామ సంగ్రహము, భాస్కర రామాయణములను చదువుకున్నది. ఈమెకు వివాహం తన 11వ యేట 1912లో కల్లూరి వేంకటసుబ్బారాయుడుతో జరిగింది.
 
==కవిత్వము==
ఈమె తండ్రి కవి అగుటచేత ఈమెకు 12వ, 13వయేటనే పద్యములు అల్లడం వచ్చింది. మొదట ఈమె గోపాల శతకమును ప్రకటించింది. తరువాత ప్రభాకర శతకము, చంద్రమతీ చరిత్రము, దమయంతీ చరిత్రము అనే పద్యకావ్యాలను రచించింది. ఈ రచనా కాలంలో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి తండ్రిని సంప్రదించెడిది. శ్రీపాద వారు మహాభారతమును రచిస్తుంటే ఈమెకు సంగ్రహ భారతం వ్రాయాలనే అభిలాష కలిగింది. తండ్రి ప్రోత్సాహముతో మూడు నెలల వ్యవధిలో భారత కథామృతమును వ్రాసి తండ్రికి వినిపించింది. అతడు అది విని ఆమెను కొనియాడి తన పత్రిక [[వజ్రాయుధం]]లో వరుసగా ప్రకటించాడు.