కల్లూరి విశాలాక్షమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==కవిత్వము==
ఈమె తండ్రి కవి అగుటచేత ఈమెకు 12వ, 13వయేటనే పద్యములు అల్లడం వచ్చింది. మొదట ఈమె గోపాల శతకమును ప్రకటించింది. తరువాత ప్రభాకర శతకము, చంద్రమతీ చరిత్రము, దమయంతీ చరిత్రము అనే పద్యకావ్యాలను రచించింది. ఈ రచనా కాలంలో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి తండ్రిని సంప్రదించెడిది. శ్రీపాద వారు మహాభారతమును రచిస్తుంటే ఈమెకు సంగ్రహ భారతం వ్రాయాలనే అభిలాష కలిగింది. తండ్రి ప్రోత్సాహముతో మూడు నెలల వ్యవధిలో భారత కథామృతమును వ్రాసి తండ్రికి వినిపించింది. అతడు అది విని ఆమెను కొనియాడి తన పత్రిక [[వజ్రాయుధం]]లో వరుసగా ప్రకటించాడు. తరువాత ఇది పుస్తకరూపంలో తన 21వయేట ప్రకటించింది. ఈ పుస్తకానికి ప్రముఖ విమర్శకుడు [[నాగుపూడినాగపూడి కుప్పుస్వామయ్య]] పీఠికను రచించాడు. ఈ కావ్యం [[జయంతి రామయ్య]], [[ఆదిభట్ల నారాయణదాసు]] వంటి పండితుల ప్రశంసలను అందుకుంది. తరువాత ఈమె భాగవత కథామృతమును, శ్రీరామ కథామృతమును రచించింది. భాగవత కథామృతము [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] వారి ద్రవ్య సహాయంతో ప్రచురింపబడింది. దీనికి [[కేశిరాజు వేంకట నృసింహ అప్పారావు]] పీఠికను వ్రాశాడు. [[వెంపరాల సూర్యనారాయణశాస్త్రి]], [[నోరి నరసింహశాస్త్రి]], [[దివాకర్ల వేంకటావధాని]], [[నిడుదవోలు వేంకటరావు]] మొదలైనవారు ఈ కావ్యాన్ని మెచ్చుకున్నారు.