ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి [[శ్రీ కృష్ణదేవరాయలు]] రచించిన తెలుగు [[ప్రబంధం]] ఈ "'''ఆముక్తమాల్యద'''" గ్రంథం. దీనికే "'''విష్ణుచిత్తీయం'''" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో [[పంచకావ్యాలు]]లో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ ఏడాశ్వాసాల ప్రబంధంలో ప్రధానమైన కథ [[గోదాదేవి]] మరియు శ్రీరంగేశుల కల్యాణం.
 
==నేపధ్యం, ప్రారంభం==
కృష్ణదేవరాయలు విజయవాడకు యాత్రపై వచ్చి విడీది చేసినపుడు శ్రీకుకాళాంధ్ర విష్ణువు ఆయన కలలో కనబడి తెలుగులో తనపై ఒక కావ్యమును రాయమని ప్రోత్సహించినట్టుగా ఒక కథనం కలదు.
[[ఆముక్తమాల్యద]]<nowiki/>లోని మొట్టమొదటి పద్యములో [[వేంకటేశ్వరుడు|శ్రీవేంకటేశ్వరుని]] స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో మరియు '[[శ్రీ]]' శబ్దంతో కావ్యామారంభించాడు.
 
ఇది అముక్త మాల్యద అనేపేరున ఉన్న విష్ణుచిత్తుని కథ. విష్ణు చిత్తునితో ప్రారంభమై యమునాచార్యుడు, మాలదాసరి కథలను ఉపకథలుగా చెప్తూ గోదాదేవి కళ్యాణంతో అంతమయ్యే కథ.
 
[[ఆముక్తమాల్యద]]<nowiki/>లోని మొట్టమొదటి పద్యములో [[వేంకటేశ్వరుడు|శ్రీవేంకటేశ్వరుని]] స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో మరియు '[[శ్రీ]]' శబ్దంతో కావ్యామారంభించాడు.
 
 
:శ్రీ కమనీయ హారమణి జెన్నుగ దానును, గౌస్తుభంబునం
Line 13 ⟶ 18:
 
==కథాంశాలు==
ఈ ప్రబంధంలో గోదాదేవి పెంపుడు తండ్రియైన [[విష్ణుచిత్తుడు]] శ్రీవిల్లిపుత్తూరులో మన్ననారుస్వామి కోవెలలో అర్చకుడిగా జీవిస్తున్నాడు. విష్ణుచిత్తునకు తులసీవనంలో స్త్రీ శిశువు లభించింది. సంతానం లేని తనకు విష్ణువే కరుణించి తనకీ శిశువును ఇచ్చాడని ఆమెకు గోదాదేవి అని నామకరణం చేసి పెంచుకోసాగాడు. ఆమె పూర్వజన్మంలో [[భూదేవి]]. తన తండ్రి స్వామి కోసం అల్లిన పూలమాలను చాటుగా ధరించి గోదాదేవి తన నీడను చూచుకొని ఆనందించి తిరిగి ఆ మాలను యథాస్థానంలో పెట్టేది. ఆ మాలనే విష్ణుచిత్తుడు స్వామికి అర్పించేవాడు. ఆ కారణంగానే గోదాదేవికి ఆముక్తమాల్యద అను పేరు వచ్చింది. తాను పూర్వజన్మలో సత్యభామా దేవిననే విషయం తెలుసుకుంది. అలనాటి [[శ్రీకృష్ణుడు]] ఇప్పుడు [[శ్రీరంగం]]లో వెలిసాడని, ఆ శ్రీరంగేశుని తన భర్తగా వలచింది. ఆ స్వామి ఆమెను వలచాడు. ఇరువురికి వివాహం జరుగుతుంది.
 
ప్రధానకథకు అనుబంధంగా [[మత్స్యధ్వజుడు]], [[ఖాండిక్యకేశి|ఖాండిక్యకేశిధ్వజులు]], [[యమునాచార్యుడు]], [[మాలదాసరి]] అనే కథలున్నాయి. ఇవి [[విష్ణువు]] యొక్క విశిష్ట్యాన్ని తెలియజేస్తాయి.
 
ఈ గ్రంథమున 7 ఆశ్వాసములు ఉన్నాయి.మొదటి ఆశ్వాసమున ఇష్టదేవతాస్తుతి, గ్రంథకర్త ప్రశంస, కృతిపతి ప్రశాంస, గ్రంథప్రవృత్తికి హేతువు, షష్ఠ్యంతములను ఉన్నాయి. ఈ విషయములు 49 పద్యములతో చెప్పబడినవి. ఇందలి కృతిపతి ప్రశాంసయందు తెలియవచ్చెడి విషయమేమనగా కృష్ణరాయలు "కళింగదేశంమీద దండెత్తి విజయం సాధించి శ్రీకాకులనికేతుతనండగు శ్రీవిష్ణువుణు సేవింపబోయి ఆ రాత్రి స్వప్నంబున ఆంధ్ర జలజాక్షుడాతనితో ఆంధ్రభాషయందు ఒక్క కృతి మాకు ప్రియముగ నిర్మించమని చెప్పినాడుట".
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు