శ్రుతి హాసన్: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:6385:416D:AE36:6A4C:43D2:32CB (చర్చ) చేసిన మార్పులను [[User:CommonsDelinker|CommonsDelink...
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 15:
==సినీ జీవితం==
===కెరియర్ తొలినాళ్ళు (2000, 2008-2011)===
2000లో తన తండ్రి [[కమల్ హాసన్]] దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా నటించిన శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసినిమా చేసింది. ఆ సినిమా ఘోరపరాజయానిఘోరపరాజయాన్ని చవిచూసింది. శ్రుతికి కూడా తన నటనకు విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. 2011లో [[కె. రాఘవేంద్రరావు]] గారి కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో [[సిద్దార్థ్]] సరసన "అనగనగా ఓ ధీరుడు" సినిమాలో నటించింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శ్రుతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయంగానే మిగిలింది. కానీ ఆ సంవత్సరానికి తను ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును పొందింది.
 
అదే సంవత్సరంలో "దిల్ తో బచ్చాహై జీ" సినిమాలో అతిథి పాత్రలో నటించిని శ్రుతి ఆపై ఏ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో [[సూర్య శివకుమార్|సూర్య]] సరసన "7అం అరివు" సినిమాలో నటించింది. ''సెవెంత్ సెన్స్'' పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. శ్రుతికి కూడా తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలో తన చివరి సినిమా సిద్ధార్థ్ సరసన "[[ఓ మై ఫ్రెండ్]]" సినిమాలో నటించింది. [[చిరంజీవి]] గారినటించిన "[[ఇద్దరు మిత్రులు]]" సినిమాకి దగ్గరగా ఉండే ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శ్రుతి ఒక నటిగా తెలుగులో మంచి గుర్తింపును సాధించింది.
 
===గబ్బర్ సింగ్ తర్వాత శ్రుతి ప్రస్థానం (2012-ఇప్పటి వరకు)===
"https://te.wikipedia.org/wiki/శ్రుతి_హాసన్" నుండి వెలికితీశారు