ఎ.కోదండరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
కోదండరామిరెడ్డి [[నెల్లూరు జిల్లా]] [[మైపాడు]]లో మధ్య తరగతి [[వ్యవసాయం|వ్యవసాయ]] కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి వెంకూరెడ్డి, తల్లి రమణమ్మ. [[ఇందుకూరుపేట]], [[నరసాపురం]]<nowiki/>లలో చదువు కొనసాగించి, ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదువుకున్నాడు. విద్యార్థిదశనుండే నాటకాలంటే కోదండరామిరెడ్డికి పిచ్చి. పీయూసీ చదువుతూ మధ్యలోనే చదువు మానేసి సినిమాల్లో హీరో అవ్వాలనే కోరికతో రైలెక్కి [[చెన్నై|మద్రాసు]] వచ్చాడు. అక్కడ తన బంధువు [[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకరరెడ్డి]] ద్వారా [[పి.చంద్రశేఖరరెడ్డి (దర్శకుడు)|పి.చంద్రశేఖరరెడ్డి]] పరిచయమయ్యాడు. అతని సలహా మేరకు హీరో వేషాలకై ప్రయత్నాలు మానివేసి [[మనుషులు మారాలి]] సినిమాకు [[వి.మధుసూధనరావు]] వద్ద సహాయ దర్శకుడిగా చేరాడు. వి.మధుసూధనరావు వద్ద సుమారు ఏడు సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా పనిచేసి అనుభవం సంపాదించుకున్నాడు. తరువాత ఇతడు సూర్యనారాయణబాబు నిర్మాతగా [[సుజాత (నటి)|సుజాత]]ను కథానాయికగా నిర్మించబడిన [[సంధ్య (1980 సినిమా)|సంధ్య]] అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించాడు.
 
సంధ్య సినిమా తరువాత ఇతనితో [[క్రాంతి కుమార్]] [[చిరంజీవి]] హీరోగా [[న్యాయం కావాలి]] సినిమా తీశాడు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఇతని దర్శకత్వంలో చిరంజీవి హీరోగా అభిలాష, రక్తసింధూరం, మరణమృదంగం, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, త్రినేత్రుడు, వేట, కిరాతకుడు, దొంగమొగుడు, కొండవీటి దొంగ మొదలైన సినిమాలు సుమారు 25 వరకు వెలువడ్డాయి. చిరంజీవిని ఎక్కువ సినిమాలకు డైరెక్ట్ చేసిన ఘనత ఇతనికే దక్కింది.
 
ఇతడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]తో కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, పల్నాటి సింహం, ఖైదీరుద్యయ్య వంటి సినిమాలు, [[నందమూరి బాలకృష్ణ]]తో అనసూయమ్మగారి అల్లుడు, తిరగబడ్డ తెలుగుబిడ్డ, నారీ నారీ నడుమ మురారి, భానుమతి గారి మొగుడు, రక్తాభిషేకం, భార్గవ రాముడు, బొబ్బిలి సింహం, నిప్పురవ్వ మొదలైన సినిమాలు, [[అక్కినేని నాగార్జున]]తో కిరాయిదాదా, విక్కిదాదా, ప్రెసిడెంటుగారి పెళ్ళాం, అల్లరి అల్లుడు వంటి సినిమాలు తీశాడు. ఇంకా [[అక్కినేని నాగేశ్వరరావు]], [[మోహన్ బాబు]], [[కమల్ హాసన్]] వంటి అనేక నటుల సినిమాలకు దర్శకుడిగా పనిచేశాడు.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఎ.కోదండరామిరెడ్డి" నుండి వెలికితీశారు