సరైనోడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
'''సరైనోడు''' [[2016]]లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగ]]ు యాక్షన్ డ్రామా చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని [[బోయపాటి శ్రీను|బోయపాటి శ్రీన]]ు అందించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటీంచాడు. ఈ సినిమాకి [[తమన్|తమన్ యస్]] సంగీతాన్ని సమకూర్చాడు. [[రకుల్ ప్రీత్ సింగ్]], కేథరిన్‌ త్రెసా ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని [[అల్లు అరవింద్]] గారి [[గీతా ఆర్ట్స్]] బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడు.
==కథ==
గన (అల్లు అర్జున్) ఎక్స్ మిలిట్రీ. బోర్డర్ లో కన్నా సమాజంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని మిలిట్రీ వదిలేసి వచ్చిన గన, హైదరాబాద్ లో తన కుటుంబంతో ఉంటూ, అన్యాయాలను, అక్రమాలను ఎదిరించటమే పనిగా పెట్టుకుంటాడు. గన మీద ప్రేమతో పిల్లలు కూడా వద్దనుకున్న బాబాయ్ (శ్రీకాంత్) ఎప్పుడూ అతనితోనే ఉంటాడు. గన ఓక రోజు తను నివాసించే ఏరియా ఎమ్మెల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా)ని చూసి ప్రేమలో పడతాడు. మొదట ఆమె ఒప్పుకోకపోయినా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలా ఎమ్మెల్యే హర్షితా రెడ్డి(క్యాధరిన్ ధ్రిసా) ని ఒప్పించి తన ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్తున్న సమయంలో అతన్ని వెతుక్కుంటూ మహాలక్ష్మి (రకుల్ ప్రీతి సింగ్) వస్తుంది. వచ్చి తనను కాపాడమంటుంది. మహాలక్ష్మి పెద్ద ప్రమాదంలో ఉంటుంది. ఆమెను చంపటానికి వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) అనే విలన్ మనుషులు వెంటబడుతూంటారు. అప్పుడు గన ఏం చేసాడు? ఆమెను కాపాడాడా?. వైరం ధనుష్ తో వైరం పెట్టుకున్నాడా? మరి ఎమ్మల్యేతో లవ్ స్టోరీ ఏమైంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
 
==నటీనటులు==
*[[అల్లు అర్జున్]]
"https://te.wikipedia.org/wiki/సరైనోడు" నుండి వెలికితీశారు