చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
 
==పందిరి చిక్కుడు==
[[File:చిక్కుడు కాయలు (9).jpg|thumb|చిక్కుడు కాయలు]]
[[File:చిక్కుడుకాయ వంకాయ ముక్కలు పోపు కూర (2).jpg|thumb|చిక్కుడుకాయ, వంకాయ ముక్కలు పోపు కూర]]
పందిరి చిక్కుడును ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. తమిళ, [[కర్నాటక]], [[ఆంధ్రప్రదేశ్]], [[మధ్యప్రదేశ్]], [[మహారాష్ట్ర]]<nowiki/>లలో దీన్ని విస్తారంగా సాగుచేస్తున్నారు. ఇప్పుడిప్పడే ఉత్తర భారతదేశంలో ఇది ప్రాచుర్యం పొందుతోంది. రాష్ట్రంలో చిక్కుడుజాతి [[కూరగాయలు]] 12వేలకు పైగా హెక్టార్లలో పండిస్తూ ఏటా 70వేలకు పైగా టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. పందిరి [[చిక్కుడు]] కాయలను కూరగాయగా, ఎండిన విత్తనాలను పప్పుదినుసుగా వాడతారు. ఫ్రెంచిచిక్కుడుతో పోల్చితే దీనిలో పోషక విలువలు అధికం. ప్రతి వంద గ్రా. చి క్కుడు 48 కేలరీల శక్తిని ఇస్తుంది. -- [[బీన్స్]] ఎక్కువగా, వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని కోస్టా రికా అధ్యయనంలో తేలింది. దాదాపు రెండువేల మంది మహిళలు, పురుషుల మీద నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ బీన్స్‌ను తక్కువ మోతాదులో అన్నాన్ని తీసుకునే వారిలో [[మధుమేహం]] తగ్గుముఖం పట్టిందని తేలింది. బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 25 శాతం వరకు [[మధుమేహం|డయాబెటిస్‌]]<nowiki/>ను నియంత్రించవచ్చునని తెలిసింది. అలాగే వరి [[అన్నం]] శరీరంలో [[చక్కెర]] శాతాన్ని పెంచుతుంది కాబట్టి రైస్‌ను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిదని [[బోస్టన్|బోస్టన్‌]]<nowiki/>లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఫ్రాంక్ హు తెలిపారు. వరి అన్నం కంటే బీన్స్‌లో ఫైబర్, ప్రోటీన్స్ ఉండటంతో మధుమేహం, [[రక్తపోటు]]ను నియంత్రిస్తుందని ఫ్రాంక్ వెల్లడించారు.
"https://te.wikipedia.org/wiki/చిక్కుడు" నుండి వెలికితీశారు