ఆస్ట్రేలియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మొదటి మనుషులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధ్రుడమై → దృఢమై using AWB
చి →‎ఇంగ్లాండునుండి సెటిల్‌మెంట్లు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఊరుకి → ఊరికి using AWB
పంక్తి 84:
1780 ప్రాంతంలో ఇంగ్లాండులోని చరసాలలు నిండిపోయాయి. అందువల్ల, చాలా మంది ఖైదీలను పాత, పనికిరాని ఓడలలో బంధించేవారు. అప్పుడు ప్రభుత్వం న్యూ సౌత్ వేల్స్ లో ఒక వలస స్థానం (settlement) ఏర్పాటు చేసి, కొంతమంది ఖైదీలను అక్కడికి పంపాలని నిర్ణయించింది. 1788లో 11 ఓడలు పోర్ట్స్ మౌత్ నుండి బయలుదేరాయి. ఆ ఓడలలో ఖైదీలు, నావికులు, కొంత మంది స్వతంత్రంగా వలసకు సిద్ధమైనవారు (free settlers), రెండు సంవత్సరాలకు సరిపడే ఆహారము ఉన్నాయి. ఆ ఓడలకు నాయకుడు, క్యాప్టెన్ ఆర్తర్ ఫిలిప్స్. వాళ్ళ ధ్యేయం క్యాప్టెన్ కుక్ కనుగొన్న స్థలంలో ఒక గ్రామాన్ని కట్టడం. అక్కడ ఆ శాస్త్రవేత్తలు కనుగొన్న చెట్ల వల్ల, ఆ చుట్టుపక్కల సముద్రాన్ని బాటనీ బే (Botany Bay) అని పేరు పెట్టారు.
 
బాటని బే దగ్గర త్రాగు నీరు ఎక్కువగా లేవు. అందువలన క్యాప్టెన్ ఫిలిప్స్ కొంచం దూరం ముందుకెళ్ళీ చూసాడు. అక్కడ అతినికి ఒక పెద్ద సహజ రేవు కనపడింది. తరువాత తన జీవితంలో అంత మంచి రేవు చూడలేదని క్యాప్టెన్ ఫిలిప్స్ అన్నాడు. ఒక చిన్న నది ఉన్న స్థలం ఎంచుకున్నారు. 1788లో ఇంగ్లాండు పతాకం ఎగురవేసి, న్యూ సౌత్ వేల్స్‌కి, ఇంగ్లాండు రాజు, మూడవ జార్జిని రాజుగా ప్రకటించారు. ఆ చిన్న ఊరుకిఊరికి సిడ్నీ అని పేరు పెటారు.
 
మెదట కొన్ని రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఇంగ్లాండు వారు ఎలాంటి ఖైదీలను పంపాలో అలోచించలేదు. అక్కడ ఉన్న వాళ్లలో ఒక్కడికే పొలం దున్నటం వచ్చు. ఇళ్ళు ఎలా కట్టాలో ఎవరికీ తేలీదు. తెచ్చుకున్న ఆవులు, మేకలు అన్ని తప్పించుకుపోయాయి. అక్కడ ఉన్న చెట్లు ఇంతకుముందు ఎవరు ఎక్కడా చూడలేదు. అవి తినచ్చో లెదో తెలీదు. అక్కడికి వచ్చిన జనం మెత్తం చనిపోయేంత పనైంది.
"https://te.wikipedia.org/wiki/ఆస్ట్రేలియా" నుండి వెలికితీశారు