బంగాళదుంప: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
== రకరకాలైన వంటలు ==
[[File:బంగాళాదుంప కూర (2).jpg|thumb|బంగాళాదుంప అల్లం మరియు పచ్చిమిర్చి కూర]]
[[File:బంగాళాదుంప చిక్కుడుకాయ పోపు కూర (2).jpg|thumb|బంగాళాదుంప చిక్కుడుకాయ పోపు కూర]]
బంగాళదుంపతో రుచికరమైన [[వంట]]లు, [[కూరలు]], [[చట్నీలు]], [[ఫలహారాలు]] మరియు ఇతర ఆహార పదార్ధాలు తయారుచేయవచ్చును. ఉడకబెట్టిన కూర, వేపుడు, కుర్మా వంటివి తరచు తెలుగు నాట చేసే కూరలు. ఇంకా బజ్జీల వంటి తినుబండారాలు చేస్తారు. ఊరగాయలు కూడా పడుతుంటారు. బంగాళదుంప చిప్స్ వంటి తినుబండారాలు మార్కెట్లో లభిస్తాయి. పాశ్చాత్య దేశాలలో బంగాళ దుంపతో చేసే పదార్ధాలు అక్కడి అలవాట్లకు తగినవిగా ఉంటాయి. ఇవి భారతీయ వంటకాలకంటే భిన్నమైనవి. ఏమైనా బంగాళ దుంపను తరిగి, లేదా ఉడకబెట్టి లేదా వేయించి అనేక రకాలైన, రుచికరమైన పదార్ధాలు తయారు చేయడం చాలా సమాజాలలో సర్వసాధారణం అయింది.
 
"https://te.wikipedia.org/wiki/బంగాళదుంప" నుండి వెలికితీశారు