ఉగాది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
=== యుగయుగాల ఉగాది ===
[[File:ఉగాది పచ్చడి.jpg||right|thumb|250px|ఉగాది పచ్చడి]]
[[File:అరటి పండ్లు (2).jpg|thumb|అరటి పండ్లు]]
 
[[రామాయణం]]లో చైత్రం 12 వనెల.రాముడు ఋతువులన్నీ గడిచి 12 వ నెల అయిన చైత్రమాసంలో శుద్ధ నవమినాడు జన్మించినట్లు బాల కాండలో ఉంది. ( తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిధౌ) దీనినిబట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది. మార్గశిర పుష్య మాసాలున్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని [[కౌత్యుడు]] మతం. [[అమరసింహుడు]] [[అమరకోశము]] కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే మొదటి ఋతువని అన్నాడు.మార్గశిర మాసానికి <nowiki>'''</nowiki>ఆగ్రహాయణికః<nowiki>'''</nowiki> అనేది పర్యాయ పదం. ఆగ్రంలో హాయనం కలది- అంటే సంవత్సరమంతా ముందుండేది, లేక సంవత్సరాగ్రంలో ఉండేది. అంటే మన సంవత్సరాది మార్గశిర పుష్య, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖాల వరకు డేకుతూ వచ్చిందనడం స్పష్టం. అంటే ఆశ్వీజామావాస్య కార్తీక పూర్ణిమ, మార్గశిర పుష్యాలలో సంక్రాంతి పండుగ, మాఘ పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణిమ, హోలీ పండుగ, వసంతపంచమి, వైశాఖ పౌర్ణమీ ఇవన్నీ సంత్సరాదులే. రామాయణంలో అన్నట్లు వైశాఖంలో సవత్సరం ప్రారంభించె ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తరాపధంలో సూర్యమాన సంవత్సరాదికి బైసాఖి ( వైశాఖి) అనే వ్యవహారం ఉంది. [[భారతం]]లో చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువనే గణన ఉంది. భవిష్య పురాణంలో యుగాదులను గూర్చిన వర్ణన కూడా సంవత్సరాది వైవిధ్యాన్ని ధ్రువ పరుస్తాయి. కృతయుగం వైశాఖ తృతీయనాడు, త్రేతాయుగం కార్తీక నవమినాడు, ద్వాపరయుగం ఆశ్వీజ త్రయోదశినాడు, కలియుగం ఫాల్గుణ పౌర్ణమినాడు పుట్టాయని [[కృష్ణుడు]] [[ధర్మరాజు]]కు చెప్పినట్టు, వీటిని యుగాదులంటారని అన్నట్టు ఉంది. ( యుగాదయశ్చ కథ్యంతే తధైతా స్సర్వ సూరిభిః) మరి ఈ దినమే ఉగాది ఎలా?
 
"https://te.wikipedia.org/wiki/ఉగాది" నుండి వెలికితీశారు