మదన్‌లాల్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మార్చి 20, 1951లో పంజాబ్ లోని అమృత్‌సర్ లో జన్మించిన '''మదన్‌ల...
(తేడా లేదు)

20:11, 24 జనవరి 2008 నాటి కూర్పు

మార్చి 20, 1951లో పంజాబ్ లోని అమృత్‌సర్ లో జన్మించిన మదన్‌లాల్ (Madan Lal Udhouram Sharma)[1] భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు [[1974] నుంచి 1987 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 31 టెస్టులు, 67 వన్డేలు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చక్కగా రాణించి 10,000 పరుగులు మరియు 600 వికెట్లు సాధించాడు.

మదన్‌లాల్ భారత్ తరఫున 31 టెస్టులలో పాల్గొని 22.65 సగటుతో 1042 పరుగులు సాధించాడు. అందులో 5 అర్థ సెంచరీలు కలవు. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 74 పరుగులు. బౌలింగ్‌లో 71 టెస్ట్ వికెట్లు సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 పర్యాయాలు తీసుకున్నాడు. టెస్టులలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 23 పరుగులకు 5 వికెట్లు.

  1. http://content.cricinfo.com/ci/content/player/30873.html | మదన్‌లాల్ ప్రొఫైల్