ఆదిల్‌షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
బహామని ప్రావిన్సు రాజధాని అయిన బీజాపూర్ నే వీరు కూడా చివరి వరకూ రాజధానిగా కొనసాగించారు. ఇబ్రహిం ఆదిల్ షా I (1534–1558), అలీ ఆదిల్ షా I (1558–1579) బీజాపూర్ నగరాన్ని పునర్నిర్మించారు. వీరిద్దరి పరిపాలనా కాలంలో నగరానికి ప్రహారీ, కాంగ్రిగేషన్ మసీదు, రాజభవనాలు, ప్రధాన నీటి సరఫరా మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపట్టారు. వారి వారసులు అయిన ఇబ్రహం ఆదిల్ షా II (1580–1627), ఆదిల్ షా (1627–1657), అలీ ఆదిల్ షా II (1657–1672)లు బీజాపూర్ ను సుందరమైన రాజభవనాలు, మసీదులు, సమాధులు, ఇతర కట్టడాలతో మరింత అలంకరించారు. దక్కన్ సుల్తనేట్, ఇండో-ఇస్లామిక్ నిర్మాణ శైలికి అత్యుత్తమ ఉదాహరణాలలో ఒకటిగా నిలిచింది బీజాపూర్ నగరం.
 
బహమనీ సామ్రాజ్యం పతనం కావడంతో బీజాపూర్ లో అస్థిరత నెలకొంది. [[విజయనగర సామ్రాజ్యం]], ఇతర దక్కన్ సుల్తానేట్ లతో నిరంతర యుద్ధాల కారణంగా రాజ్యంలో అభివృద్ధి క్షిణించింది. దక్కన్ సుల్తానేట్ మిత్ర రాజ్యాలన్నీ కూటమిగా కలసి 1565లో తలికోటలో విజయనగర రాజుల్ని ఓడించి, సామ్రాజ్యాన్ని గెలుచుకున్నారు. బీజాపూర్ ఎన్నో ప్రయత్నాల తరువాత ఆఖరుకి పొరుగు సుల్తనేట్ అయిన [[బీదర్]]ను 1619లో గెలుచుకున్నారు. పోర్చుగీస్ సామ్రాజ్యం గోవాలోని ఆదిల్ షాహికి చెందిన రేవు పట్టణంపై తీవ్ర ఒత్తిడి కొనసాగించేవారు. ఈ రేవుపై పోర్చుగీస్ వారు పెత్తనం చెలాయించేవారు. ఆఖరుకి ఇబ్రహిం II పరిపాలనాకాలంలో ఆ రేవు పట్టణాన్ని పోర్చుగీస్ వారు గెలుచుకున్నారు. [[ఛత్రపతి శివాజీ]] తిరుగుబాటుతో కొంత ఇబ్బంది ఎదుర్కున్నా, కొన్నాళ్ళు బీజాపూర్ రాజ్యం స్థిరంగానే కొనసాగింది. శివాజి తండ్రి షాజీ బోన్స్ లే ఆదిల్ షా పాలనలో మరాఠా ప్రాంతానికి ప్రధాన సేనాధిపతిగా పనిచేశాడు. తరువాతి కాలంలో శివాజీ మరాఠా ప్రాంతాన్ని గెలుచుకుని స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బ్రిటీష్ సామ్రాజ్యానికి ముందు మరాఠా సామ్రాజ్యం భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యంగా నిలిచింది. 16వ శతాబ్దం చివరి భాగంలో బీజాపూర్ సామ్రాజ్యానికి [[మొఘల్ సామ్రాజ్యం]] దక్కన్ ప్రాంతంలో విస్తరణ ప్రారంభం వల్ల అతిపెద్ద ముప్పు మొదలైంది. నిజానికి శివాజీ తిరుగుబాటుతో బలహీనపడిన బీజాపూర్ సామ్రాజ్యంపై మొఘల్ రాజులు సులువుగా అదుపు సంపాదించగలిగారు. Variousఆదిల్ agreementsషాహీ andసామ్రాజ్యంపై treatiesవివిధ imposedఒప్పందాలు Mughalవిధించడం suzeraintyద్వారా onమొఘలులు theబీజాపూర్ Adilలో Shahs,విదేశీ పరిపాలన చేయడం ప్రారంభించారు. by stages, until Bijapur's formal recognition of Mughal authority in 1636. The demands of their Mughal overlords sapped the Adil Shahs of their wealth until the Mughal conquest of Bijapur in 1686.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆదిల్‌షాహీ_వంశం" నుండి వెలికితీశారు