నిజాం పాలనలో లంబాడాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''[[నిజాం పాలనలో లంబాడాలు]]''' పేరిట భంగ్యా భుక్యా రాసిన పరిశోధన గ్రంథం నిజాం వంశీయుల పరిపాలనలో [[లంబాడా]]ల జీవనాన్ని వివరించిన పరిశోధన గ్రంథానికి [[తెలుగు]] అనువాదం. భంగ్యా ఆంగ్లంలో రాసిన గ్రంథాన్ని రచయిత, అనువాదకుడు [[ఆకెళ్ళ శివప్రసాద్]] అనువదించారు.
== రచన నేపథ్యం ==
సబ్‌జుగేటెడ్ నోమాడ్స్ అనే శీర్షికతో ది లంబాడాస్ అండర్ రూల్ ఆఫ్ నిజాం అనే ఉపశీర్షికతో ఈ గ్రంథాన్ని భంగ్యా భుక్యా ఆంగ్లంలో రచించారు. ఆయన [[ఆంగ్లం]]లో 2010లో రచించిన ఈ పుస్తకాన్ని 2012లో అనువాదకుడు, వ్యక్తిత్వవికాస గ్రంథకర్త ఆకెళ్ళ శివప్రసాద్ అనువదించారు. [[హైదరాబాద్]] బుక్ ట్రస్ట్ సంస్థ ఈ గ్రంథాన్ని [[తెలుగు]]లో ప్రచురించింది.<ref>నిజాం పాలనలో లంబాడాలు:తెలుగు అనువాదానికి ముందుమాట:భంగ్యా భుక్యా</ref>
 
== విషయం ==
నిజాంల పరిపాలనలో లంబాడా వర్గం స్థితిగతుల గురించిన అధ్యయనం ఈ పుస్తకంలోని ముఖ్యవిషయం. మొఘల్ పరిపాలనలో దక్కన్ సుబేదారుగా ప్రారంభమైన నిజాం వంశీకుల అధికారం పోను పోను విస్తరించి స్వతంత్ర రాజ్యంగా స్థిరపడింది. అనంతర కాలంలో [[బ్రిటీష్]] పరిపాలనలో కొన్ని ప్రాంతాలను వదులుకొని రాజ్యాన్ని నిలబెట్టుకున్నారు. [[భారతదేశ]] స్వాతంత్ర్యం అనంతరం [[నిజాం]] [[హైదరాబాదు]]ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. 1940 దశకంలో ప్రారంభమైన [[నిజాం]] వ్యతిరేక పోరాటం ఉధృతరూపం దాల్చగా తుదకు 1948లో జరిగిన పోలీసు చర్యలో నిజాం రాజ్యాన్ని భారతదేశంలో అంతర్భాగంగా విలీనం చేశారు. ఈ క్రమంలో [[నిజాం]] రాజుల పరిపాలనలో లంబాడాల చరిత్రను విశ్లేషించడం ఈ పుస్తకంలోని ఉద్దేశం. అందులో భాగంగా ఆనాటి జీవన విధానం, ఆర్థికస్థితి, సాంఘిక స్థితిగతులు, రాజకీయ వ్యవహారాలు విశ్లేషించారు.
 
== ప్రాధాన్యం-ప్రాచుర్యం ==
పంక్తి 12:
* లంబాడాల రాజకీయ, ఆర్థిక స్థితిగతులను భంగ్యా భుక్యా చాలా లోతుగా, సునిశితంగా పరిశోధించి వెలుగులోకి తెచ్చిన రచన ఇది. ఒకనాడు స్వతంత్రంగా, సగర్వంగా మెలిగిన లంబాడా జాతి వలసపాలన, దాని నియంత్రణల కింద నలిగి నలిగి ఎలా క్షీణించిపోయిందో పట్టి చూపారు రచయిత. సమకాలీన అస్థిత్వ ఉద్యమాలనూ, 20వ శతాబ్దంలో వాటి ప్రాముఖ్యతనూ సవివరంగా చర్చించడం దీని ప్రత్యేకత. - క్రిస్పిన్ బేట్స్, [[ఎడిన్‌బర్గ్]] విశ్వవిద్యాలయం.<ref name="kinige description"/>
* లంబాడా జాతి, వారి జీవన విధానంపై జరిగిన తొలి శాస్త్రీయమైన అధ్యయనం ఇది. ఒక స్వతంత్ర జాతిని - రాజ్యం, దాని పరిపాలనా విధానాలు ఎలా అణగదొక్కాయో తెలియజేస్తుంది. ప్రభుత్వ బంజరు భూములను 'రక్షిత అడవులు'గా మార్చటం, లంబాడాలకు నేరపూరిత మనస్తత్వాన్ని ఆపాదించడం వంటి అంశాలన్నింటినీ చారిత్రకంగా చర్చిస్తూ, ఆసక్తికరంగా పాఠకుల ముందుంచుతుంది ఈ రచన. - డేవిడ్ హార్డిమాన్, వార్‌విక్ విశ్వవిద్యాలయం.<ref name="kinige description"/>
* సుసంపన్నమైన ఒక వ్యాపార వర్గాన్ని [[వలసవాదం|వలసవాద]] పాలనా పద్ధతులు ఎలా మార్చివేశాయో, [[హైదరాబాదు]] రాష్ట్రంలో [[లంబాడాలు]] ఏ విధంగా 'నేరజాతి'గా ముద్ర వేయబడి అణచివేతకు గురయ్యారో తెలుసుకునేందుకు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది. - గేల్ అంవెట్, [[ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్]], [[సిమ్లా]].<ref name="kinige description">[http://kinige.com/book/Nizam+Palanalo+Lambadalu కినిగెలో పుస్తకం గురించిన వివరాలు]</ref>
 
== మూలాలు ==