జ్ఞానశ్రీమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., గధ → గద, గ్రంధం → గ్రంథం (3), ప్రత్యర్ధి → ప using AWB
పంక్తి 1:
జ్ఞానశ్రీమిత్ర క్రీ.శ. 10, 11 శతాబ్దాలకు చెందిన ప్రసిద్ధ భారతీయ బౌద్ధ తత్వవేత్త మరియు తార్కికుడు. దిజ్ఞాగ-ధర్మకీర్తి లచే నెలకొల్పబడిన జ్ఞానమీమాంస (ప్రమాణం) సంప్రదాయానికి చెందిన తర్కవేత్త. ఇతను విక్రమశిల బౌద్ధ విశ్వవిద్యాలయానికి ద్వారపండితుడు, ఆచార్యుడు. రత్నకీర్తికి గురువు. క్రీ.శ. (975-1025) మధ్య కాలంలో జీవించిన జ్ఞానశ్రీమిత్ర తన కాలంలో బౌద్దబౌద్ధ వర్గాలనుండే కాక హిందూ, జైన మత వర్గాల నుండి కూడా ప్రముఖ తాత్వికుడుగా గుర్తింపు పొందాడు.<ref>McCrea; Patil, 2010, p. 2.</ref>
 
==తాత్విక చింతన==
[[జ్ఞానశ్రీమిత్ర]] జ్ఞానమీమాంస (epistemology) సాధనాల (ప్రమాణం) పై ప్రత్యేక కృషి చేసాడు. అందులోను దిజ్ఞాగునిచే వివరించబడిన అపోహ (exclusion) సిద్ధాంతం గురించి, అది తత్వశాస్త్రానికి ఏ విధంగా సంబందిస్తుందన్న విషయాలపై దృష్టి సారించాడు.
తన 'అపోహప్రకరణ' ("Monograph on Exclusion") గ్రంధంలోగ్రంథంలో అపోహ సిద్ధాంతానికి జ్ఞానమీమాంసకు మధ్య గల సంబందాన్ని విశిదీకరించడంతో పాటు [[బౌద్ధ మతము|బౌద్ధ]] న్యాయంపై [[హిందూమతము|హిందూ]] న్యాయ విమర్శకుల దాడిని తిప్పికొడుతూ తన సిద్ధాంతాన్ని సమర్ధించుకొన్నాడు.<ref>McCrea; Patil, 2010, p. 20.</ref>
అదేవిధంగా జ్ఞానశ్రీమిత్ర యోగాచార సిద్ధాంతాన్ని సమర్ధించాడు. అతని దృష్టిలో ఈ సర్వ జగత్తు విజ్ఞానం (consciousness) తోనే నిండి వుందిఉంది.<ref>McCrea; Patil, 2010, p. 21.</ref> [[విజ్ఞానం]] లేదా [[చిత్తము|చిత్తం]] ఒక్కటే సత్యం.
 
వ్యాప్తికారిక అనే గ్రంధంలోగ్రంథంలో పొగ మరియు అగ్ని వంటి విభిన్నమైన రెండు ఆస్తిత్వాల మధ్య గల తార్కిక సంబంధాలను ఇతను విశిదీకరించాడు. ఈ అంశంలో జ్ఞానశ్రీమిత్ర వైఖిరిని రచయిత హోస్ట్ లాసిక్ (Horst Lasic) వివరిస్తూ “జ్ఞానశ్రీమిత్రకు సంబంధించినంత వరకు, విభిన్న ఆస్తిత్వాల మధ్య గల అనుమాన-నిశ్చయ సంబందం 'కార్యాకారణ సంబందం' (effect-cause relation) అయివుండాలి మరియు అటువంటి సంబంధాలను కేవలం ఒక నిర్దిష్ట క్రమలో వచ్చే ప్రత్యక్షం (perception), అనుపలబ్ది (Non apprehension) ల ద్వారానే గుర్తించడం సాధ్యమవుతుంది." అని పేర్కొంటాడు."<ref>Horst Lasic, Review of: ''Parimal G. Patil; Jñānaśrīmitra's Vyāpticarcā: Sanskrittext, Übersetzung, Analyse''</ref>
 
బౌద్ధంలోని యోగాచార సంప్రదాయంలోని 'నిరాకార' శాఖకు చెందిన 'రత్నాకర శాంతి' ఇతని ప్రత్యర్ధిప్రత్యర్థి. ఈ 'నిరాకార' శాఖను ఖండిస్తూ, జ్ఞానశ్రీమిత్ర యోగాచార సంప్రదాయంలోని 'సాకార' శాఖకు ప్రధాన సమర్ధకుడిగా నిలిచాడు.<ref>McCrea; Patil, 2010, p. 3.</ref> అతను దేవునికి వ్యతిరేకంగా 'ఈశ్వరదూషణ' అనే గ్రంథాన్ని సైతం రచించాడు.
 
==రచనలు==
పంక్తి 16:
* అనేకచింతామణి
* అనుపలాబ్దిరహస్య
* అపోహప్రకరణ : తర్క సంబందమైన ముఖ్య గ్రంధంగ్రంథం.
* భేదాభేదపరీక్ష
* సాకారసిద్ధిశాస్త్ర
పంక్తి 23:
* కార్యాకరణభావసిద్ధి
* క్షణభంగధ్యాయ
* (అధ్యార్ధ) ప్రజ్ఞాపారామిత నాయ శతపంచశతిక
* సాకారసంగ్రహసూత్ర
* సర్వజ్ఞసిద్ధి
పంక్తి 34:
*Lawrence J. McCrea, and Parimal G. Patil. Buddhist Philosophy of Language in India: Jnanasrimitra on Exclusion. New York: Columbia University Press, 2010. 216 pp.
*Satis Chandra Vidyabhusana; A History of Indian Logic: Ancient, Mediaeval and Modern Schools
*Michael Hann (Editor), Mahesh Deokar (Editor) ; Vrttamalastuti of Jnanasrimitra with Sakyaraksita's Vrttamala (Stuti) Vivrti (Studia Indo Buddhica) Hardcover
*Kellner, Jnanasrimitra's Anupalabdhirahasya and Sarvasabdabhavacarca, A critical Edition with A Survey of His Anupalabdhi-Theory; ISBN (Paperback): : 3902501065, 9783902501066
*Hahn, M. 1971. Jñānaśrīmitra’s Vrttamâlâstuti. Ein Beispielsammlung zur altindischen Metrik. Nach dem tibetischen Tanjur zusammen mit der mongolischen Version herausgegeben, übersetzt und erläutert. Wiesbaden: Harrassowitz.
*Kellner, B. 2007. Jñānaśrīmitra’s Anupalabdhirahasya and Sarvaśabdābhāvacarcā: A Critical Edition with a Survey of His Anupalabdhi-Theory. Wiener Studien zur Tibetologie und Buddhismuskunde no. 67. Vienna: Arbeitskreis für Tibetische und Buddhistische Studien, Universität Wien.
"https://te.wikipedia.org/wiki/జ్ఞానశ్రీమిత్ర" నుండి వెలికితీశారు