నాగపూడి కుప్పుస్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
==సాహిత్య సేవ==
ఈ విమర్శకుని జీవిత మానందతుందిలమైనది. శిష్టానుష్టాన పరులు. శాంతహృదయులు. తెలుగన్నచో నెన్నరాని యభిమానము. వీరి కుటుంబములోని వారందఱు భారత భాగవతాదుల పారాయణముతో గాలవ్యయము సేయుచుండువారట. కుప్పుస్వామయ్యగారి భారతసారము, [[భోజరాజీయము]] నను వచన గ్రంధములు మధురశయ్యా బంధములు."కవులకుగద్యము గీటురాయి" యని దండి పండితుని యాభాణకము. దానికి దగినట్లుగా నీయన వచనధోరణి మంచియొడుపు బెడగులలో నుండెడిది. చిన్నయసూరివలె నీయనయుజక్కని వచనరచయితయని నాడు వశంసించిరి. వ్యావహారిక వాద మీయన యామోదింప లేదు. ఉత్తరములుకూడ నీయన సలక్షణభాషలో రచించెను. సంస్కృతమున వీరి పాండితికి దారకాణగా "స్తవరత్నావళి"నారయవచ్చును. శ్రీశృంగేరి జగద్గురువులు-శ్రీ కుంభఘోణము జగద్గురువులును వీరి గీర్వాణవాణీప్రౌఢిమమునకు మెచ్చి గౌరవించిరి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి భారతమునకు వీరువ్రాసిన విపులభూమిక పరికింపదగినది. ఆనందముద్రాలయ, వావిళ్ళముద్రాలయ ప్రకటితములయిన పెక్కుకృతులు కుప్పుస్వామయ్యగారి పీఠికలతో నందగించుచున్నవి.
 
చెన్నపురి విశ్వవిద్యాలయమున బ్రాచ్యవిద్వద్బిరుదపరీక్ష లుండవలయునని పోరిపెట్టించివారిలో మొదటివా డీవిమర్శకాగ్రేసరుడే. వీరిశిష్యులెందఱోవందలు నేడును చిత్తూరు మండలమున నుండిరని వాడుక.