గోపీనాథ్ మొహంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== ఉద్యోగ జీవితం ==
ఇతనికి కాలేజీలో ఉపన్యాసకుడిగా పనిచేయాలన్న కోరిక ఉండేది. అది నెరవేరకుండానే ఇతడు 1938లో ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు ఎంపిక అయ్యాడు. ఇతని మొదటి నియామకం జాజ్‌పూర్‌లో జరిగింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో పెద్ద వరద వచ్చింది. ప్రభుత్వోద్యోగిగా వరద సహాయ కార్యక్రమాలు చేపట్టే అనుభవం ఇతనికి మొదటిసారిగా అప్పుడు కలిగింది. తర్వాతి కాలంలో 'మాటీ మటాల్' వ్రాసినప్పుడు ఈ అనుభవం ఇతనికి ఎంతగానో తోడ్పడింది. 1940లో [[ఒడిశా|ఒరిస్సా]] దక్షిణ ప్రాంతంలోని గిరిజన ప్రాంతానికి బదిలీ అయ్యాడు. ఈ బదిలీ ఒరియా సాహిత్యానికే కాక భారతీయ సాహిత్యానికే ఒక వరంగా మారిందని పలువురు భావిస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారిగా [[కొరాపుట్|కోరాపుట్]] ప్రాంతంలోని ఆదివాసులతో పాటు జీవించి వారి జీవితాన్ని నిశితంగా పరిశీలించాడు. వారి స్థితిగతుల గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఆదివాసులలో పరజా, కంధ్, గదబా, కోల్హ్, డంబ్ మొదలైన జాతుల ప్రజలతో ఇతడు మమైకమై పోయాడు. తన ఉద్యోగ కాలంలో ఆదివాసులతో ఇతడు ఎంతగా కలిసిపోయాడంటే కోరాపుట్ జిల్లాలోని జమీందారులు, వడ్డీ వ్యాపారులు 1953లో అప్పటి ప్రధానమంత్రికి ఇతనికి విరుద్ధంగా ఒక నివేదిక కూడా పంపారు. మొహంతి తన ఉద్యోగకాలంలో ఒరిస్సాలో చాలా చోట్ల పనిచేసినా కోరాపుట్‌తోను, అక్కడి ఆదివాసులతోను ఇతనికి విడదీయరాని బంధం ఏర్పడింది<ref name=మిసిమి />.
 
అధ్యాపకుడు కావాలన్న తన కోరికను ప్రభుత్వ ఉద్యోగ విరమణ తర్వాత ఉత్కళ్ విశ్వవిద్యాలయంలో రెండేళ్ళ పాటు ఆంగ్ల అధ్యాపకునిగాను, 1986లో అమెరికాలోని సాన్ జోస్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో సాంఘిక శాస్త్రంలో అధ్యాపకునిగా పనిచేసి నెరవేర్చుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/గోపీనాథ్_మొహంతి" నుండి వెలికితీశారు