సింధూ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Indus.A2002274.0610.1km.jpg|thumb|right|250px|సింధు నది ప్రాంతం.]]
 
'''సింధూ నది''' ([[సంస్కృతం]]: सिन्धु ; [[ఆంగ్లం]]: '''Indus River''') [[భారత ఉపఖండం]]లో ప్రసిద్దమయిన హిమ [[నది]]. ఇది హిమాలయాలలో [[టిబెట్]]లో పుట్టి [[జమ్మూ కాశ్మీరు|కాశ్మీర్]], [[పంజాబ్]], [[సింధ్]] రాష్ట్రాలలో ప్రవహించి [[పాకిస్తాన్]]‍ లోని [[కరాచీ]] సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది.<ref>{{cite book|title=Managing Water Conflict: Asia, Africa and the Middle East|first=Ashok|last=Swain|year=2004|publisher=Routledge|url=https://books.google.com/books?id=0IHpYZtKzXMC|page=46|isbn=1135768838|quote=1,800 miles long river after flowing out of Tibet through the Himalayas enters Jammu and Kashmir in India and then moves into Pakistan}}</ref><ref>{{cite book|url=https://books.google.co.in/books?id=UKeFvM_m2_sC&pg=PA59&dq=indus|title=The Indus Basin of Pakistan: The Impacts of Climate Risks on Water and Agriculture|page=59|publisher=World Bank publications|isbn=9780821398753}}</ref> [[పాకిస్థాన్]]లోని అతిపెద్ద, జాతీయ నది సింధు.<ref>{{cite news|url=https://www.dawn.com/news/492660|title=Geography: The rivers of Pakistan|work=Dawn|date=26 September 2009|accessdate=15 August 2017}}</ref>
సింధు నదికి ఉపనదులు [[జీలం నది|జీలం]], [[చీనాబ్ నది|చీనాబ్]], [[రావి నది|రావీ]], [[బియాస్ నది|బియాస్]], [[సట్లెజ్ నది|సట్లెజ్]] ప్రవహించే ప్రాంతం అంతా అతి సారవంతమయిన నేల. ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళా డాము, సుక్కూలారు బ్యారేజ్, భారతదేశంలో పంజాబ్‍లో [[సట్లెజ్ నది]] మీద [[భాక్రానంగల్]] ఆనకట్ట, భారీ డ్యాములు, ఆనకట్టలు కట్టి సాగునేలకు పంట నీటిని అందించి [[గోధుమ]], [[వరి]], [[చెరకు]] విరివిగా పండించుటయేగాక జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. సింధు నది పొడవు 2880 కి.మీ. [[హరప్పా]], [[మొహంజో-దారో|మొహంజోదారో]] ప్రాంతాల్లో ఈ [[సింధు]] నదీ లోయలో సుమారు 5,000 ఏళ్ళ ఉజ్జ్వలమైన [[సింధు లోయ నాగరికత]] వెలసి వర్థిల్లింది.
 
సింధూ నది టిబెట్‌లోని [[మానస సరోవరం]], కైలాస పర్వతాలనుంచి జమ్ము కశ్మీర్‌లోని లడాఖ్‌ మీదుగా- గిల్గిట్‌, బాల్టిస్థాన్‌నుంచి పాకిస్థాన్‌లోని [[పంజాబ్, పాకిస్తాన్|పంజాబ్‌]] రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహా సముద్రంలో కలుస్తోంది. సింధూ నదికి సంబంధించిన అనేక ఉపనదులు భారత్‌లోని [[జమ్ము కశ్మీర్‌]], [[హిమాచల్‌ ప్రదేశ్‌]], [[పంజాబ్‌]], [[హరియాణా]], [[రాజస్థాన్‌]]ల మీదుగా ప్రవహించి [[పాకిస్థాన్‌]]లో ప్రవేశిస్తాయి. 3,180 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే సింధూనది వార్షిక నీటిప్రవాహం ప్రాతిపదికన ప్రపంచంలో 21వ అతి పెద్ద నదిగా గుర్తింపు పొందింది. చైనా, భారత్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఈ జీవనది పరీవాహక ప్రాంతం మొత్తం 11,65,000 చదరపు కిలోమీటర్లు. భారత పాకిస్తన్‌లు సింధు నదీ జలాలను వినియోగించుకునేందుకు ఒక [[సింధునదీ జలాల ఒప్పందం|అంతర్జాతీయ నీటి పంపక ఒడంబడిక]]<nowiki/>ను కుదుర్చుకున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సింధూ_నది" నుండి వెలికితీశారు