మిణుగురులు: కూర్పుల మధ్య తేడాలు

Added the name of original story writer
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లను గురించి → ల గురించి using AWB
పంక్తి 18:
| gross =
}}
మిణుగురులు అనేది 2014 లో వచ్చిన ఒక [[తెలుగు]] సినిమా. ఈ సినిమా కథాంశం ఒక అంధ విద్యార్థుల జీవితం లోజీవితంలో జరిగే అన్యాయాలనుఅన్యాయాల గురించి తెలుపుతుంది.అయోధ్య కుమార్ కృష్ణమశెట్టి ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు.14 వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలలో ఎంపికైన ఏకైక తెలుగు సినిమా ఇది.
==చిత్ర కథ==
రాజు అనే 14 ఏళ్ళ బాలుడు ప్రమాదంలో కంటి చూపును కోల్పోతాడు, కొడుకును చూసి అతడు తమ మధ్య నివసించలేడని భావించిన తండ్రి అతడిని ఒక అంధ విద్యార్థుల వసతిగృహంలో వదిలేస్తాడు. ఇక్కడ ఇన్‌చార్జుగా ఉన్న ఆశిష్ విద్యార్థి, తాగుడుకు మరియు జూదాలకు బానిస అయ్యి తప్పు మీద తప్పులు చేస్తూ వాటి నుండి బయటపడటానికి అప్పులు చేస్తూ వాటిని తీర్చుటకు వసతిగృహ నిర్వహణకై వచ్చే నిధులను దుర్వినియోగం చేస్తాడు. అనాథ శరణాలయంలో ఉంటూ ఎన్నో అన్యాయాలను చేస్తున్న సిబ్బందిని గమనించిన రాజు, ఈ విషయాన్ని ఎలాగైనా కలెక్టరుకు చేరవేసి వారి సహాయాన్ని పొందాలనుకుంటాడు. రాజు కనుచూపును కోల్పోకముందు అతనికి వ్రాయడం వచ్చు కనుక ఆ అనుభవంతోటి మిత్రులతో కలిసి ఒక ఉత్తరాన్ని వ్రాసి దానిని రోజూ పాలు పోయడానికి వచ్చే అతడి బాల్య మిత్రుడికి ఇచ్చి జిల్లా కలెక్టరు కార్యాలయానికి చేరవేస్తాడు. విషయం తెలుసుకున్న కలెక్టరు గారు వెంటనే దానిపై నివేదిక ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తారు. వెనువెంటనే హాస్టలులో ఇన్స్పెక్షన్ నిర్వహించబడబోతోంది అనే విషయాన్ని తెలుసుకున్న సిబ్బంది జాగ్రత్తపడి తూతూమంత్రంగా ఏర్పాట్లు చేసి పర్యవేక్షణకు వచ్చిన అధికారిని మభ్యపెట్టుటకు ప్రయత్నించి ఇన్‌చార్జ్ విఫలమవుతాడు. ఈ క్రమంలో కొంత ధనంతో అధికారిని ప్రలోభపెట్టి విషయాన్ని పైకి చేరకుండా చేస్తాడు. రాజు తన మిత్రుల బృందం చేసిన యత్నం విఫలం కావడంతో నిరాశకు గురవుతారు. వసతిగృహంలో జరిగే విషయాలను పై అధికారులకు ఉత్తరం వ్రాసింది ఎవరో కనుక్కునే ప్రయత్నంలో ఉన్న ఇన్‌చార్జు కొత్తగా చేరిన రాజే చేసాడని తెలుసుకుని అతడిని చితకబాదుతాడు.
"https://te.wikipedia.org/wiki/మిణుగురులు" నుండి వెలికితీశారు