లింగమంతుల స్వామి జాతర: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శాఖాహార → శాకాహార, ( → ( using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శాఖాహార → శాకాహార, ( → ( using AWB)
లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్యదైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల లాగు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలుపట్టుకుని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ఓలింగా... ఓ లింగా అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానంలేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. తోడుగా వచ్చిన వాళ్లు దేవుడికి బలిచ్చే గొర్రెపొటేల్‌ను తీసుకొస్తుంటారు. ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపొటేల్‌కు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి, పసుపు, కుంకుమ బొట్లుపెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండేశ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవి పూజలందుకుంటారు.
 
లింగమంతుడు శాఖాహారిశాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. ఈ ఉత్సవాలు రెండేళ్లకోసారి జరుగుతాయి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాకుండా పక్కరాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతీయేటా సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు.
 
==చౌడమ్మ పల్లకిలో..==
 
==చేరుకోవడం ఇలా... ==
పెద్దగట్టు... హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారి (65వ నెంబర్) పై దురాజ్‌పల్లిలో ఉంది. సూర్యాపేట నుంచి 5 కిలోమీటర్ల దూరం. ప్రత్యేక బస్సులుంటాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
2,04,044

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2324395" నుండి వెలికితీశారు