కె.కె.సెంథిల్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
తరువాత ఆయనసినిమాటోగ్రాఫర్ గా ప్రస్థానాన్ని ఎంచుకున్నాడు. ఆయనకు సినీరంగ నేపధ్యం లేనందువల్ల కొంతకాలం ఖాళీగా ఉన్నాడు. అపుడు సినిమా చిత్రకారుడైన పున్నయ్య సలహాతో సినిమా ఛాయాగ్రాహకుడు శరత్ వద్ద అసిస్టెంటుగా చేరాడు.
 
ఆయన అసిస్టెంట్ గా మొదటి చిత్రం 1999 లో విదుదలైన [[ప్రేమకు వేళాయెరా]]. తరువాత జాబిలి సినిమాలో అసిస్టెంట్ ఛాయాగ్రాహకునిగా పనిచేసాడు. ఆయన టెలివిజన్ సీరియల్ [[అమృతం (ధారావాహిక)|అమృతం]] లో కెమేరామన్ గా అవకాశాన్ని ప్రముఖ దర్శకుడు [[చంద్రశేఖర్ యేలేటి]] ఇచ్చాడు. ఇది సినిమా పరిశ్రమలో ఛాయాగ్రాహకునిగా ఎదగడానికి దోహదపడింది.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/senthilkumar.html|title=Senthil Kumar interview - Telugu Cinema interview - Telugu film cinematographer|website=www.idlebrain.com|access-date=2018-03-30}}</ref>
 
ఆయన 2003లో [[చంద్రశేఖర్ యేలేటి]] దర్శకత్వం వహించిన తెలుగు సినిమా [[ఐతే (సినిమా)|ఐతే]] ద్వారా సినీ రంగప్రవేశం చేసాడు. ఆ చిత్రం తెలుగులో జాతీయ ఉత్తమ సినిమా పురస్కారాన్ని పొందింది. తరువాత ఆరునెలలు ఏ సినిమా కూడా లేకుండా [[ఎస్. ఎస్. రాజమౌళి]] తన సినిమా [[సై]] లో పనిచేసేందుకు ఆహ్వానించే వరకు ఖాళీగా ఉన్నారు.