మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

16 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
[[File:మజ్జిగ (3).jpg|thumb|మజ్జిగ]]
మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. మజ్జిగను పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది.
ఆవు మజ్జిగ మూడు దోషాలను తగ్గిస్తుంది. పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది. గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది. అలాగే వాపును పెంచుతుంది. కాబట్టి పరిమితంగా వాడాలి. [[మేక]] మజ్జిగ తేలికగా ఉంటుంది. మూడు దోషాల మీద పనిచేస్తుంది. మజ్జిగను వాడకూడని సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు [[జలోదరం]] (ఎసైటిస్), యకృద్‌వృద్ధి (హెపటోమెగాలి), [[ఉబ్బసం]], [[దగ్గు]], బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధుల్లో మజ్జిగను వాడటం మంచిది కాదు.
*మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
*పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2325181" నుండి వెలికితీశారు