విష్ణువు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
== వేదాలలో విష్ణువు ==
[[దస్త్రం:Garuda Vishnu Laxmi.jpg|right|thumb|200px|గరుఢారూఢులైన లక్ష్మీనారాయణులు - 1730 నాటి చిత్రం]]
[[నాలుగు వేదాలు]] హిందూమతానికి మూలగ్రంధాలని చెప్పవచ్చును. వీటిలో అన్నింటికంటే పురాతనమైనదని భావించే [[ఋగ్వేదం]]లో విష్ణువును స్తుతిస్తూ ఐదు సూక్తులు ఉన్నాయి. ఇవి కాక ఇంకొక సూక్తంలో కొంతభాగం విష్ణువును గురించి ఉంది. వేదాలలో విష్ణువును గురించి మూడు ముఖ్యలక్షణాలు తరచు ప్రస్తావింపబడినాయి - (1) మూడు పెద్ద అంగలు వేసినవాడు ([[త్రివిక్రముడు]]). మూడు అడుగులతో లోకాలను ఆక్రమించినవాడు (2) పెద్ద శరీరం కలిగినవాడు (వరాహమూర్తి). జగత్తంతా వ్యాపించి ఉంటాడు. (3) యువకుడు, నవ యవ్వనుడు. ఇంకా విష్ణువు తన గుర్రాలను (రోజులను) వాటి ఆరు పేర్లతో (ఋతువులతో) చక్రాన్ని తిప్పినట్లు కదల్చాడని చెప్పబడింది. విష్ణువు స్వభావంలో మరొక ముఖ్యాంశం ఇంద్రునితో స్నేహం. వృత్రాసురునితో యుద్ధం చేసేటపుడు, అనంతర రాక్షస సంహారంలోను ఇంద్రునికి విష్ణువు సహకరించాడు.<ref name="krovi">'''శ్రీ కైవల్య సారథి''' విష్ణు సహస్రనామ భాష్యము - రచన: డా. క్రోవి పార్ధసారథి - ప్రచురణ:శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2003)</ref>.
 
ఒక వివరణ ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య అనేక యుద్ధాలు జరుగుతుండేవి. దేవతలు ఓడిపోయినా గాని ఏదో ఒక ఉపాయం వలన చివరికినెగ్గుకొచ్చేవారు అని [[ఐతరేయ బ్రాహ్మణము]]లోబ్రాహ్మణములో ఉంది. [[శతపథ బ్రాహ్మణము]]లోబ్రాహ్మణములో ఒక కథ ప్రకారం యుద్ధానంతరం విష్ణువు మూడడుగులలో ఆక్రమించే భూమిని దేవతలకు ఇచ్చేలా రాక్షసులు ఒప్పందం చేసుకొన్నారు. అప్పుడు విష్ణువు లోకాలను, వేదాలను, వాక్కును తన మూడడుగులతో ఆక్రమించాడు. అదే [[వామనావతారము]]. శతపథ బ్రాహ్మణములో "ఏమూష" అనే పేరుగల వరాహం భూమిని నీటినుండి పైకి ఎత్తింది అని చెప్పబడింది. [[తైత్తరీయ సంహిత]]లోసంహితలో ఆ వరాహమే ప్రజాపతి అవతారమని ఉంది. అదే [[వరాహావతారము]]. శతపథ బ్రాహ్మణములో [[మనువు]]ను ప్రళయంనుండి ఒక చేప కాపాడుతుంది అని ఉంది. అదే [[మత్స్యావతారము]]. ప్రజాపతి నీటిలో తిరిగే తాబేలుగా మారాడు. అదే [[కూర్మావతారము]]. ''యజ్ఞో వై విష్ణుః'' - అనగా ''యజ్ఞము విష్ణు స్వరూపము'' - అని వేదంలో చెప్పబడింది.<ref name="krovi"/>
 
[[కృష్ణ యజుర్వేదము|కృష్ణ యజుర్వేదానికి]] సంబంధించిన [[నారాయణోపనిషత్తు]]లోనారాయణోపనిషత్తులో ఇలా ఉంది -
:''ఓం. అథ పురుషో హ వై నారాయణోఽ కామయత, ప్రజాః సృజయేతి, నారాయణాత్ప్రాణో జాయతే, మనస్సర్వేంద్రియాణిచ, ఖం వాయుర్జ్యోతి రాపః, పృథివీ విశ్వస్య ధారిణీ, నారాయణాద్బ్రహ్మాజాయతే.... .... '' -- సృష్టి ప్రారంభంలో పరమపురుషుడైన నారాయణుడు మాత్రమే ఉన్నాడు. అతడు సృష్టి చేయాలనుకొన్నాడు. అప్పుడు నారాయణుని శరీరంనుండి హిరణ్యగర్భుడు పుట్టాడు.. ...
 
"https://te.wikipedia.org/wiki/విష్ణువు" నుండి వెలికితీశారు