విష్ణువు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 59:
 
ఒక వివరణ ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య అనేక యుద్ధాలు జరుగుతుండేవి. దేవతలు ఓడిపోయినా గాని ఏదో ఒక ఉపాయం వలన చివరికినెగ్గుకొచ్చేవారు అని ఐతరేయ బ్రాహ్మణములో ఉంది. శతపథ బ్రాహ్మణములో ఒక కథ ప్రకారం యుద్ధానంతరం విష్ణువు మూడడుగులలో ఆక్రమించే భూమిని దేవతలకు ఇచ్చేలా రాక్షసులు ఒప్పందం చేసుకొన్నారు. అప్పుడు విష్ణువు లోకాలను, వేదాలను, వాక్కును తన మూడడుగులతో ఆక్రమించాడు. అదే [[వామనావతారము]]. శతపథ బ్రాహ్మణములో "ఏమూష" అనే పేరుగల వరాహం భూమిని నీటినుండి పైకి ఎత్తింది అని చెప్పబడింది. తైత్తరీయ సంహితలో ఆ వరాహమే ప్రజాపతి అవతారమని ఉంది. అదే [[వరాహావతారము]]. శతపథ బ్రాహ్మణములో [[మనువు]]ను ప్రళయంనుండి ఒక చేప కాపాడుతుంది అని ఉంది. అదే [[మత్స్యావతారము]]. ప్రజాపతి నీటిలో తిరిగే తాబేలుగా మారాడు. అదే [[కూర్మావతారము]]. ''యజ్ఞో వై విష్ణుః'' - అనగా ''యజ్ఞము విష్ణు స్వరూపము'' - అని వేదంలో చెప్పబడింది.<ref name="krovi"/>
===కృష్ణ యజుర్వేదం===
 
కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన నారాయణోపనిషత్తులో ఇలా ఉంది -
:''ఓం. అథ పురుషో హ వై నారాయణోఽ కామయత, ప్రజాః సృజయేతి, నారాయణాత్ప్రాణో జాయతే, మనస్సర్వేంద్రియాణిచ, ఖం వాయుర్జ్యోతి రాపః, పృథివీ విశ్వస్య ధారిణీ, నారాయణాద్బ్రహ్మాజాయతే.... .... '' -- సృష్టి ప్రారంభంలో పరమపురుషుడైన నారాయణుడు మాత్రమే ఉన్నాడు. అతడు సృష్టి చేయాలనుకొన్నాడు. అప్పుడు నారాయణుని శరీరంనుండి హిరణ్యగర్భుడు పుట్టాడు.. ...
===ఋగ్వేదం===
 
[[ఋగ్వేదం]]లో ఇలా ఉంది -
:''అథ నిత్యో నారాయణః, బ్రహ్మో నారాయణః, శక్రశ్చ నారాయణః, ద్యావా పృథివ్యౌచ నారాయణః, కాలశ్చ నారాయణః, దిశశ్చ నారాయణః, ఊర్ధ్వంచ నారాయణః, అధశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః,నారాయణ ఏవేదగ్‌ం సర్వం, యద్భూతం యచ్చభవ్యం, నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో, నిరాఖ్యాతశ్శుద్ధో దేవ ఏకో నారాయణః,న ద్వితీయోఽస్తి కశ్చిత్, య ఏవం వేదస విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి, ఏతద్యజుర్వేద శిరోఽధీతే'' -- నారాయణుడే సత్యము, నిత్యము, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, భూమి, ఆకాశము, పైన, క్రింద, అన్నిదిశలు, బయట, లోపల అన్నీ నారాయణుడే. అతడే భూత భవిష్యద్వర్తమానాలు. అతడు నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు. నారాయణుని మాటలతో నిర్వచింపలేము..
"https://te.wikipedia.org/wiki/విష్ణువు" నుండి వెలికితీశారు