భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
==ప్రముఖ డిమాండ్లు==
 
నిబంధనల ప్రకారం భారతరత్న పురస్కారానికి రాష్ట్రపతికి, ప్రధానమంత్రి మాత్రమే సిఫార్సులు చేసే హక్కు ఉంది.<ref name="scheme"/> వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రముఖ నాయకుల పేర్లను ఎన్నోసార్లు సిఫార్సుకు డిమాండ్లు చేస్తూనే ఉన్నాయి. జనవరి 2008లో, [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు [[ఎల్.కె.అద్వానీ]], మాజీ ప్రధానమంత్రి [[అటల్ బిహారీ వాజపేయి]]కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. <ref name="pm">{{cite web|url=http://pmindia.gov.in/en/former-prime-ministers/|title=Prime Ministers of India|publisher=Prime Minister's Office (India)|accessdate=12 May 2014|archiveurl=https://web.archive.org/web/20141009232119/http://pmindia.gov.in/en/former-prime-ministers/|archivedate=9 October 2014}}</ref><ref>{{cite news|url=http://www.telegraphindia.com/1080110/jsp/frontpage/story_8765534.jsp|title=Uneasy lies crown that awaits Ratna—Advani proposes Vajpayee's name, method and timing fuel murmurs|newspaper=The Telegraph (Calcutta)|location=Calcutta|date=10 January 2008|accessdate=19 May 2014|author=Chatterjee, Manini|archiveurl=https://web.archive.org/web/20140521031231/http://www.telegraphindia.com/1080110/jsp/frontpage/story_8765534.jsp|archivedate=21 May 2014}}</ref> ఇది జరిగిన వెంటనే [[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)]] తమ నాయకుడు, [[బెంగాల్]] మాజీ ముఖ్యమంత్రి [[జ్యోతి బసు]]కు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. బసు భారతదేశంలోనే అత్యంత ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకునిగా రికార్డు సృష్టించిన వ్యక్తి. అయితే తనకు భారత రత్న వద్దనీ, అందుకు తాను అర్హుణ్ణి కాదనీ, దాని వల్ల ఆ పురస్కారానికి గౌరవం తగ్గుతుంది అని వ్యాఖ్యానించారు.<ref name="cmwb"/> <ref>{{cite news|url=http://www.dnaindia.com/india/report-jyoti-basu-can-be-given-bharat-ratna-cpi-m-1144394|title=Jyoti Basu can be given Bharat Ratna: CPI (M)|date=11 January 2008|accessdate=19 May 2014|location=Kolkata|publisher=Daily News and Analysis|agency=Press Trust of India|archiveurl=https://web.archive.org/web/20140521032255/http://www.dnaindia.com/india/report-jyoti-basu-can-be-given-bharat-ratna-cpi-m-1144394|archivedate=21 May 2014}}
* {{cite news|url=http://www.hindu.com/2008/01/13/stories/2008011350130100.htm|title=Jyoti Basu "not in the race"|newspaper=The Hindu|agency=Press Trust of India|date=13 January 2008|accessdate=19 May 2014|location=Kolkata|archiveurl=https://web.archive.org/web/20140331181337/http://www.hindu.com/2008/01/13/stories/2008011350130100.htm|archivedate=31 March 2014}}
</ref> [[తెలుగు దేశం పార్టీ]], బహుజన్ సమాజ్ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ వంటి ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా తమ తమ నాయకులైన [[ఎన్.టి.రామారావు]], [[కాన్షీరామ్]], ప్రకాష్ సింగ్ బాదల్ లకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.<ref>{{cite web|url=http://www.thestatesman.net/news/26456-bharat-ratna-losing-its-sanctity.html|title=Bharat Ratna losing its sanctity?|publisher=The Statesman|date=24 November 2013|accessdate=19 May 2014|archiveurl=https://web.archive.org/web/20140520221105/http://www.thestatesman.net/news/26456-bharat-ratna-losing-its-sanctity.html|archivedate=20 May 2014}}</ref> సెప్టెంబరు 2015లో, ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన [[శివసేన]], ప్రముఖ స్వతంత్ర్య సమరయోధుడు [[వినాయక్ దామోదర్ సావర్కర్]] కు పురస్కారం ఇవ్వాలని డిమాండు చేసింది. ఆయనను మునుపటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని పేర్కొంది. అయితే వినాయక్ కుటుంబసభ్యులు ఈ అభ్యర్ధనను తాము సమర్ధించబోమనీ, వినాయక్ కు అవార్డు రావాలని తాము డిమాండు చేయట్లేదనీ, స్వాతంత్ర్యం కోసం దేశానికి ఆయన చేసిన సేవలను భారతరత్న ఇవ్వకపోతే జాతి మరచిపోదని స్పష్టం చేయడం విశేషం.<ref>{{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2015-09-15/news/66568740_1_bharat-ratna-sena-president-uddhav-thackeray-sena-mp|title=Shiv Sena starts drive to collect 10 lakh signatures to get Bharat Ratna for Vinayak Damodar Savarkar|newspaper=The Economic Times|date=15 September 2015|accessdate=7 November 2015}}
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు