రాజశేఖర చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Rajasekhara Charitramu-Kandukuri Veeresalingam Novel Cover Page.jpg|right|thumb|1987లో విశాలాంధ్ర ప్రచురణ '''రాజశేఖర చరిత్రము''' ముఖపత్రము]]
[[తెలుగు]] భాషలో మొట్ట మొదటి (గద్యము) వచన నవల. దీనిని రచించినవారు శ్రీరచించినది [[కందుకూరి వీరేశలింగం]] పంతులు. ఈయన తెలుగు భాషలో మొట్ట మొదటి నవల రచయిత. ఈయన ఈ నవలను అలీవర్ గోల్డ్‌స్మిత్ ఆంగ్లంలో వ్రాసిన [[The Vicar of Wakefield|ది వికార్ అఫ్ వేక్ ఫీల్డ్]] నుండి ప్రేరణ పొంది రచించాడురచించినట్లు అయినా పెద్ద సంబంధములేక అన్ని విషయాలు కొత్తవే నని రచన పుస్తకంగా రెండవ ముద్రణ వెలువడినపుడు తెలియచేశాడు.
ఈ పుస్తకం ఆంగ్లం, తమిళం, కన్నడ మొదలగు భాషలకు అనువాదం చేయబడి ప్రజాదరణ పొందినది. ఎన్నోసార్లు యూనివర్శిటీ పాఠ్యపుస్తకంగా కూడా ఎంపిక చేయబడింది.
 
తెలుగు నవలలో ఇదే మొదటిది కాకున్నా ఈ పుస్తకం ప్రభావం రీత్యా తెలుగు మొదటి నవలగా పేరుగాంచినదని, తరువాత వ్రాసిన నవల లన్నిటికీ, నవలా రచయిత లందరకూ చాలా కాలం వరకూ, రాజశేఖర చరిత్రమే మార్గదర్శకంగా వున్నది,కనుకనే రాజశేఖర చరిత్రం తొలి తెలుగు నవల ఆయినదని ఈ నవలపై విమర్ననాత్మక గ్రంథం రాసిన రాసిన డా ॥అక్కిరాజు రమాపతిరావు గారు పేర్కొన్నాడు. ఈ నవలలో ఆనాడు సంఘంలో ప్రచురంగా కొనసాగుతున్న సర్వ దురాచారాలనూ, పంతులు గారు యీ నవలలో వజ్రాభమైన తమ నిశిత బుద్ధిని చూపి, ఆవేశంతో చెండాడారని రమాపతిరావు తెలిపాడు. సుప్రసిద్ద నవలా రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తమ స్వీయ చరిత్రలో తాము నవలలు వ్రాయటం రాజశేఖర చరిత్రం చదివి, గ్రహించి, నేర్చుకున్నామని వ్రాసుకున్నారు.
 
==తొలి తెలుగు నవల==
Line 14 ⟶ 17:
 
==కథ==
రాజశేఖర చరిత్రంలో రాజశేఖరుడు గారి ఆమాయకత్వము, అవివేకము వలన అతని కుటుంబం ఎన్నోకష్టాలపాలవుతుంది. అంధ విశ్వాసాలవల్ల, ఆవివేకఫుటాచారాలను ఉపయోగించుకొని సంఘంలోని కపటులు కల్లరులు, కుక్షింబరులు, స్తుతి పాఠకులు, దాంభికులు బాగుపడుతున్నది తెలియచేస్తుంది.
“శ్రీ రంగరాజ చరిత్రము”లో తెలుగు ఆచారాలు సంప్రదాయాలను వివరిస్తూ నవలను రాసినట్లు రచయిత చెప్పుకున్నారు. ఈ నవల పంతొమ్మిదవ శతాబ్దంలో రాసినా అప్పటికి నాలుగువందల సంవత్సరాల క్రితం జరిగిన కథ అందులో ఉంది. ఒక గిరిజన యువతిని రాజు చూడటం, అమెను ప్రేమించటం, పెళ్ళి చేసుకోవటం ప్రధాన ఇతివృత్తం. గిరిజన యువతి అనగానే పుట్టుక చేతనే ఆమె గిరిజన యువతి కాదు. కొన్ని కారణాల వల్ల తన కుటుంబం నుండి చిన్నప్పుడే విడిపోయి గిరిజన కుటుంబంలో పెరిగి పెద్దవుతుంది. ఆమె అందాన్ని చూసి రాజు పెళ్ళి చేసుకుంటాడు. తీరా చూస్తే ఆ యువతి రాజుగారి మేనత్త కూతురే. దళిత స్పర్శ ఉంది కాబట్టి, అప్పటికే రచయితకు సామాజిక అభ్యుదయ దృక్పథం ఉన్నట్లు భావించి దాన్ని తొలి తెలుగు నవలగా కొంతమంది కీర్తిస్తున్నారు. నిజానికి నాటి అస్పృశ్యతను చెప్పటమే తప్ప చెప్పే తీరులో గానీ, భావజాలంలో గానీ ఆధునికత లేదు. ఈ విషయంలో కందుకూరి వారి “రాజశేఖర చరిత్రము”లోనూ అస్పృశ్యతను చూపించారు. రెండు నవలల్లోనూ కథా నాయకుడికి దాహం వేస్తుంది. అస్పృశ్యుడు ఎదురుపడినా వాళ్ళ చేతుల్లో నుండి నీళ్ళు తాగవలసి వచ్చినా ప్రాణలైనా వదిలేయటానికి సిద్ధమే కానీ, తాగడానికి ఇష్టపడని స్థితిని వర్ణించారు.
ప్రతి సంఘటనా - ఒక సాంఘిక దురా చారాన్నీ, ఒక మూఢ విశ్వాసాన్నీ హేళన చేసి, వికృత పరచి, విమర్శించే ఉద్దేశంతో కల్పించబడింది. రుక్మిణి కాసులపేరు రథోత్సవంలో దొంగిలించ బడటం - ప్రశ్న చెప్పేవారి దాంభిక వర్తనను బట్టబయలు చేయటానికీ, నృసింహస్వామి మరణవార్త ఎఱుక చెప్పువాళ్ళ కాపట్యాన్ని, ఎరుక నమ్మేవాళ్ళ మూర్ఖత్వాన్నీ హేళన చేయటానికీ, నృసింహ స్వామి రుక్మిణి కలలో కల్పించటం- భూత, ప్రేత , పిశాచాదులను వేళాకోళం చేయటానికీ పంతులు గారు కల్పించారు. హరిశాస్త్రుల భూతవైద్యం, పిఠాపురంలో ఆంజనంవేసి దొంగను పట్టటం, స్వర్ణయోగం తెలుసు నన్న బైరాగి- ఇచ్చిన స్వర్ణాన్ని దొంగిలించి పలాయనం చిత్తగించటం, సిద్ధాంతి కూతురు గ్రహ బాధ, బొమ్మకంటి సుబ్బారాయుడి ఆతుర సన్యాసం, హరి పాపయ్య శాస్త్రుల వారి భోజన పాండిత్యం, పీఠాధిపతుల ఆర్భాటాలూ; మఠాధిపతుల కుక్షింభరత్వం, ఇళ్ళు కాలిపోతే గ్రామదేవతకు శాంతి చేయడం - ఇంకా వీధి బడుల్లోని అక్రమాలూ, వంట బ్రాహ్మలూ-శవవాహకుల మూర్ఖవర్తనలు పంతులుగారు యీ నవలలో విమర్శించారు.
 
 
==విశేషాలు==
నరహరి గోపాల కృష్ణమశెట్టి “శెట్టి” కులస్థుడు కనుక, ఆయన రచనను తొలి తెలుగు నవలగా అంగీకరించలేదనే వాళ్ళూ ఉన్నారు. కానీ కందుకూరి వీరేశలింగం పంతులుగారి “రాజశేఖర చరిత్రము” ఆయన సమకాలీన కాలాన్ని ప్రతిఫలించేటట్లు రాశారు. ఆయన రాసిన నవలకు "వివేకచంద్రిక" అనే పేరు కూడా ఉంది. ఆ నవలలో అంతరించిపోతున్న రాజరిక జీవిత లక్షణాలు కనిపిస్తాయి. దాంతో పాటూ అశాస్త్రీయ విషయాలను ఖండించటం కనిపిస్తుంది. మూఢ విశ్వాసాలను కొన్ని పాత్రల ద్వారా కల్పించి వాటి వల్ల జరుగుతున్న మోసాలను కూడా వివరించారు. ఈ నవల గోల్డ్‌స్మిత్ రాసిన “వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్” నవలకు అనుసరణ అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ, ఈ నవల నిండా తెలుగు వాళ్ళ జీవితం, వాళ్ళు జీవించిన పరిసరాలూ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. పైగా కందుకూరి వారి రచనల నిండా ఆధునిక సంస్కరణ భావాలు ఉన్నాయి. నిజానికి తన పేరు చివర ‘పంతులు’ అనే గౌరవ వాచకాన్నీ, జంధ్యాన్నీ వదిలేస్తున్నానని ఆయన ప్రకటించారు. అయినా కానీ మనం పంతులుగారనే పిలుస్తున్నాం. ఇది ఆయనకున్న సంస్కరణ భావాలకున్న నిబద్దత.
 
ఇంకా అనేక లక్షణాలతో రాజశేఖర చరిత్రమే తొలి తెలుగు నవలగా గుర్తించబడుతుంది. సమన్వయ వాదులు మాత్రం “శ్రీ రంగరాజ చరిత్రము”ను తొలి తెలుగు చారిత్రక నవలకు పునాదులు వేసిన నవల అని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ఒకచోట
చర్చించుకోవటమే తప్ప దీనిపై ఇప్పటికే తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్నో చర్చోపచర్చలు జరిగాయి.
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/రాజశేఖర_చరిత్రము" నుండి వెలికితీశారు