కమలాదేవి ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
==స్వాతంత్ర్యోద్యమంలో==
ఈమె తల్లిదండ్రులు నాటి జాతీయ నాయకులైన [[మహదేవ గోవింద రనాడే]], [[గోపాలకృష్ణ గోఖలే]], [[రమాబాయి రనాడే]], [[అనిబీసెంట్]] లతో సన్నిహితంగా వుండేవారు. 1923లో [[మహాత్మా గాంధీ]] పిలుపు అందుకొని [[సహాయ నిరాకరణోద్యమం|సహాయ నిరాకరణ ఉద్యమం]] సేనాదళ్‌ సంస్థలో పనిచేసింది. పెక్కు విదేశాలలో పర్యటించి అక్కడి సంస్కరణలు, మహిళల స్థితి గతులు, విద్యాసంస్థలు మున్నగు వాటిని పరిశీలించింది. 1930లో గాంధీజీ ప్రారంభించిన [[ఉప్పు సత్యాగ్రహం]]లో పాల్గొన్నది. 1930లో జనవరి 26న భారత జాతీయ పతాకాన్ని, [[పోలీసులు]] అడ్డుకొన్నా, ఎగురవేసిన సాహసనారి కమలాబాయి. ఈమె [[లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాశ్ నారాయణ్]], [[రాంమనోహర్ లోహియా]]ల సోషలిస్టు భావాల వ్యాప్తికి కృషి చేసింది. దేశ విభజనానంతరం [[ఢిల్లీ]] సమీపంలోని [[ఫరీదాబాద్|ఫరీదాబాద్‌]]లో [[పాకిస్తాన్‌]] నుంచి వలస వచ్చిన 50వేల మహిళలకు వసతి, ఆరోగ్య సౌకర్యం ఏర్పాటు చేసింది.<ref>[http://www.visalaandhra.com/women/article-16717 సాహసనారి కమలాదేవి ఛటోపాధ్యాయ - [[విశాలాంధ్ర]] జూన్ 23, 2010]</ref>
 
==సినిమా నటిగా==