ఎమ్మెస్ రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
==సినీరంగంలో==
ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న రోజుల్లో (1941 లో) అంతర్ కళాశాలల లలిత సంగీత పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. జడ్జిలలో ఒకరైన [[అడవి బాపిరాజు]] చలన చిత్ర రంగంలో ప్రవేశించమని ఆయనను చాలా ప్రోత్సహించారు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత [[వై.వి.రావు]] తన [[తహసీల్దార్]] చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా '''"ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా"''' అనే ఎంకి పాట పాడించారు. ఆ చిత్రంలో నాయక పాత్ర ధరించిన [[సి.హెచ్. నారాయణరావు]]కు ఇది గాత్రదానం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఇది మొట్ట మొదటి నేపథ్య గానం. తరువాత ఈయన దీక్ష, ద్రోహి, మొదటిరాత్రి, పాండురంగమహాత్మ్యము, నాయిల్లు, సీతారామ కల్యాణము, శ్రీరామాంజనేయ యుద్ధము మొదలైన సినిమాలలో పాడారు. 1944 నుంచి 64 వరకు [[తెలుగు]] చలన చిత్రాలలో నేపథ్య గాయకునిగా మద్రాసులో నివసించిన ఆయన 5 సంవత్సరాల పాటు [[కర్ణాటక సంగీతం|కర్ణాటక శాస్త్రీయ సంగీతం]] నేర్చుకున్నారు. కొన్ని పాటలు వ్రాసి గ్రామ్ ఫోన్ రికార్డులు ఇచ్చారు: నల్లపిల్ల, తాజ్ మహల్, హంపి, కనీసం, హిమాలయాలకు రాలేనయ్యా, మొదలైనవి.నీరాజనం చిత్రంలో "ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా" పాటలో ఎమ్మెస్ గొంతు వినిపించింది.
 
1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల [[మద్రాసు]] వదిలి [[రాజమండ్]]రి చేరుకుని 1974వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతి గురుకులంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేసారు. 1970 లో పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన [[ఇండియన్ ఏర్ ఫోర్స్(IAF)]]లో పైలట్ ఆఫీసరుగా నియమితుడైనారు. 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియ లేదు. తల్లి తండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలు పెట్టారు. తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ వ్రాయడానికి అదే ప్రేరణ. 1972 నుండి 74 వరకు [[తులసీదాసు]] [[హనుమాన్ చాలీసా]]ను [[హిందీ]] నుంచి తెలుగులోనికి అనువదించారు మరియు తన పేరుతో అవినాభావ సంబంధమేర్పడ్డ 'సుందరకాండ' గేయరచన చేశారు. 1975 నుంచి [[హైదరాబాదు]]లోని [[చిక్కడపల్లి]]లో నివసించారు. రామారావుకు 1977 సంవత్సరంలో ''సుందరదాసు'' అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన [[ఏప్రిల్ 20]], [[1992]]న [[హైదరాబాదులో]] సహజ కారణాల వల్ల మరణించారు.
"https://te.wikipedia.org/wiki/ఎమ్మెస్_రామారావు" నుండి వెలికితీశారు