బిటుమినస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఘన శిలాజ ఇంధనాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
బిటిమినస్ బొగ్గు అనేది లిగ్నైట్ కన్న నాణ్యమైన, అంత్రాసైట్ కన్నతక్కువ నాణ్యత వున్న శిలాజ ఇంధనం. బిటుమినస్ బొగ్గులో కార్బను 60–80% వుండును.మిగిలినది నీరు, ఆక్సిజను, హైడ్రోజనులు.మరియు సల్ఫరు లు.బిటుమినస్ సాధారణ సాంద్రత 1346కీజిలు/ఘన మీటరుకు) (84 పౌండ్లు/ఘన అడుగు). బల్క్ [[సాంద్రత]] 833 కీజిలిలు/ఘన మీటరుకు (52 పౌండ్లు/ఘన అడుగు).బిటుమినస్ ఇంధన కేలరిఫిక్ విలువ 24 నుండి35 MJ/kg (570 0నుండి 8300 కేలరీలు/కిలో). కేలరిఫిక్ విలువను బ్రిటిషు థెర్మల్ యూనిట్లలో లెక్కించిన ఒక పౌండ్ బొగ్గు 10,500 నుండి15,000 BTU కు సమానం.
 
బిటుమినస్ బొగ్గులో తేమ 17శాతం వరకుండును. బిటుమినస్ బొగ్గు [[బరువు]]లో 0.5 నుండి 2.0 శాతం నైట్రోజన్ వుండును. ఇందులోని స్థిర కార్బన్(fixed carbon)శాతం లిగ్నైట్ బొగ్గు కన్న ఎక్కువ వుండును.ఈ రకపు బొగ్గులో వున్న వోలటైల్ పదార్థాల పరిమాణం ఆధారంగా బిటుమినస్ బొగ్గును A,B మరియు C గ్రేడ్ అని మూడు ఉపరకాలుగా విభజించారు.ఇందులో C గ్రేడ్ బొగ్గు తక్కువ వోలటైల్ పదార్థాలను కల్గి వుండును. వోలటైల్‌లు అనగా 450 నుండి 650°C ఉష్ణోగ్రత మధ్యలో ఆవిరిగా/[[వాయువు]]గా మారు స్వభావమున్న పదార్థాలు. బొగ్గులోని వోలటైలులు సల్ఫరు మరియు తక్కువ పొడవు కార్బను గొలుసు వున్న హైడ్రోకార్బనులు
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
పంక్తి 27:
|}
===బిటుమినస్ ఉప రకాలు===
బిటుమినస్ బొగ్గును ప్రాదానంగా రెండు రకాలుగా ఉప వర్గీకరణచేసారు ఒకటి థెర్మల్ లేదా స్టీము బొగ్గు మరొకటి మెటలార్జికల్ బొగ్గు. థెర్మల్ లేదా స్టీము బొగ్గును బాయిలరులో స్టీము ఉత్పత్తి చేయుటకు ఉపయోగిస్తారు. బిటుమినస్ బొగ్గును కొలిమిలో ఆక్సిజను రహిత స్థితిలో 1,100 °C(2010°F) వరకు వేడి చెయ్యడం వలన మెటలుర్జికల్ లేదా కోక్(coke)బొగ్గు ఏర్పడును. ఆక్సిజను లేకుండా మండే స్వభావ మున్న పదార్థాలను ఆక్సిజను లేకుండా వేడి చేయు విధానాన్నిఉష్ణవిచ్ఛేదన (pyrolysis) అందురు.ఈ కోక్ ను లోహాల ముడి ఖనిజాన్ని కరిగించి లోహాలుగా మార్చు కొలిమి(furnace)లో ముడి లోహంతో కలిపి మండిస్తారు. ముఖ్యంగా ఇనుమును చేయుటకు బ్లాస్ట్ ఫర్నేసులో ఇంధనంగా వాడుతారు.
 
==వనరులు-లభ్యత==
ప్రపంచంలో లభించు బొగ్గు నిల్వలలో సగం బిటుమినస్ బొగ్గు నిల్వలే. ప్రపంచంలో లబించు బొగ్గులో 80% 10 దేశాల్లో లబిస్తున్నది. ఆదేశాల్లో [[అమెరికా]]దేశానిది ప్రధమస్థానం కాగా, [[చైనా]]ది మూడవ స్థానం . మిగిన దేశాలు రష్యా,అస్ట్రేలియా, [[ఇండియా]],[[జర్మనీ]], ఉక్రైన్, కజక్‌స్థాన్,[[కొలంబియా]],[[కెనడా]]<ref>{{citeweb|url=https://web.archive.org/web/20180201222853/https://www.mining-technology.com/features/feature-the-worlds-biggest-coal-reserves-by-country/|title=Countries with the biggest coal reserves|publisher=mining-technology.com|accessdate=05-04-2018}}</ref>
 
== అమెరికాలో బిటుమినస్ బొగ్గు గనులున్నప్రాంతాలు==
అమెరికాలో ఇల్లినోయిస్, కేంటుకి, వెస్ట్ విర్జీనియా, అర్కనాస్ ప్రాంతాల్లో మరియు మిస్సిప్పి నది తూర్పు ప్రాంతంలో విరివిగా బిటుమినస్ బొగ్గు గనులు కలవు.
 
==బిటుమినస్ వలన వాతవరణ ఇబ్బందులు==
అధిక పరిమాణం లో సల్ఫరు వున్న బిటుమినస్ బొగ్గును ఇంధనంగా వాడటం వలన, ఎక్కువ సల్ఫరు [[వాతావరణం]]లోకి విడుదల అయ్యి ఆమ్లవర్హానికి కారణ మగును.బిటుమినస్ బొగ్గును మండించునపుడు వెలువడు గాలిలో తేలియాడు ధూళికణాలు(SPM) ఎక్కువగా విడుదల అగును.వీటీవలన శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం వున్నది.అందువలన వాయు కాలుష్యాన్ని నిరోధించడానికి డస్ట్ సైక్లోనులను తగిన విధంగా ఈ బొగ్గును ఇంధనంగా వాడు పరిశ్రమలలో ఉపయోగించాలి.బిటుమినస్ బొగ్గు వాడటం వలన వాతావరణంలోకి విడుదల అగు కాలుష్యాలు మరియు కాలుష్య కారకాలు తేలియాడు ధూళి కణాలు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ , [[సీసం]], [[పాదరసం|పాదరసాలు]]. అంతేకాదు మిథేన్,అల్కేన్స్, ఆల్కిన్స్,బెంజీన్ వంటి హైడ్రోకార్బనులు కుడా వాతావరణంలో కలుస్తాయి.అలాగే బొగ్గు సంపూర్ణంగా కాలడం వలన ఏర్పడిన కార్బన్ మోనాక్సైడ్ [[గాలి]]ని పరిసరాలను విష పూరితం చేయును
==ఉపయోగాలు==
విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలలో బాయిలరులో ఇంధనంగా వాడి అధిక పీడన స్టీము ఉత్పత్తి చేసి,దానితో టర్బైనులను తిప్పి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు.బిటుమినస్ బొగ్గు నుండి తయారు చేసిన కోక్ అనే బొగ్గును లోహాల ఉత్పత్తిలో ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/బిటుమినస్" నుండి వెలికితీశారు