అక్క మహాదేవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Akkamahadevi_Udathadi.JPG|thumb|right|అక్క మహాదేవి జన్మస్థానంలో మరొక శిల్పం.]]
[[దస్త్రం:Akka mahadevi diety idol at akka mahadevi caves, srisailam.jpg|thumbnail|శ్రీశైలంకి దగ్గరలో గల అక్కమహాదేవి గుహల వద్ద గల అక్క మహాదేవి విగ్రహం ]]
'''[[అక్క మహాదేవి]]''' (Akka Mahadevi) ([[కన్నడ]] : ಅಕ್ಕ ಮಹಾದೇವಿ) ప్రసిద్ధిచెందిన [[శివుడు|శివ]] భక్తురాలు. [[గోదాదేవి]] వలెనే ఈమె [[శ్రీశైలం|శ్రీశైల]] మల్లీశ్వరున్నే తన పతిగా[[పతి]]<nowiki/>గా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. ఈమె [[వీరశైవ మతం|వీరశైవ]] ఉద్యమాన్ని స్థాపించిన [[బసవేశ్వరుడు|బసవేశ్వరుని]] సమకాలికురాలు (12 శతాబ్దం). అక్క మహాదేవి [[కర్ణాటక]]లోని [[షిమోగా]] సమీపంలోని [[ఉడుతడి]] గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి దంపతులకు జన్మించింది. [[పార్వతీదేవి]] అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. [[కుటుంబము|కుటుంబ]] సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మంత్ర ఉపదేశం జరిగాయి.
 
 
ఉడుతడిని పాలించే రాజు [[కౌశికుడు]] ఒకనాడు నగరంలో[[నగరం]]<nowiki/>లో ఊరేగుతుండగా, బాల్య చాపల్యంతో రాజును మేడలపై నుండి చూస్తూ ఉన్న బాలికలలో అందాల సుందరి మహాదేవి అతని కంటబడింది. వెంటనే ఎలాగైనా ఆమెను తన [[రాణి]]గా చేసుకోవాలని తలచి మంత్రిని మహాదేవి తల్లిదండ్రుల వద్దకు పంపాడు. వారు అంగీకరించకపోవడంతో మంత్రి వారిని అధికార దర్పంతో భయపెట్టాడు. తల్లిదండ్రుల అవస్థ గమనించిన మహదేవి ఒక ఉపాయ మాలోచించి, రాజు తాను విధించే మూడు కోర్కెలు చెల్లిస్తే తాను వివాహమాడగలనని, ఏ ఒక్కదానికి భంగం వాటిల్లినా తాను స్వతంత్రురాలినై వెళ్ళిపోతానని తెలిపింది. రాజు అంగీకరించడంలో మహాదేవి రాజ మందిరం ప్రవేశించి నిత్యం లింగపూజ చేస్తూ, గురు జంగములకు తోడ్పడుతూ, అనుభవ మంటపములో పాల్గొంటూ కాలం గడపసాగింది.
 
 
పంక్తి 11:
 
 
అనుభవ మంటపానికి అధిపతి ప్రభుదేవుడు ఆమెను పరీక్షించి మంటప ప్రవేశం కల్పిస్తాడు. [[బసవేశ్వరుడు]] ఆమె తేజస్సుకు, వైరాగ్యానికి ముగ్ధుడైనాడు. అనుభవ మంటపంలోని వారందరూ ఆమెను అక్కగా భావిస్తారు. ఆనాటి నుండి ఆమె అక్క మహాదేవిగా ప్రఖ్యాతిచెందినది. ఆమె మహాలింగైక్యం కావాలని ప్రభుదేవునికి తెలుపుతుంది. అతడు శ్రీశైలంలో[[శ్రీశైలం]]<nowiki/>లో కదళీ వనంలోగల [[జ్యోతిర్లింగం]]లో ఐక్యం కావడం మంచిదని చెబుతాడు. ఎంతో కష్టపడి ఆమె [[శ్రీశైలం]] చేరుకుంటుంది. అనతికాలంలోనే ఆమె శ్రీశైల మల్లిఖార్జునిలో ఐక్యమైపోతుంది.
[[దస్త్రం:Akka maha devi caves, srisailam.jpg|thumbnail|అక్కమహాదేవి గుహలు]]
 
"https://te.wikipedia.org/wiki/అక్క_మహాదేవి" నుండి వెలికితీశారు