మధునాపంతుల వేంకట పరమయ్య: కూర్పుల మధ్య తేడాలు

మధునాపంతుల వెంకటపరామయ్య గారి పేరుతో ఒక పేజీ సృష్టించాను, కొంత సమాచారం చేర్చాను... మూలాలు త్వరలోనే చేర్చుతాను
(తేడా లేదు)

10:47, 7 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

బ్రహ్మర్షి మధునాపంతుల వేంకట పరమయ్య గారు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన ప్రముఖ కవి, ఆధ్యాత్మిక వేత్త  ఈయన పల్లెపాలెం గ్రామ కాపురస్తులైన గౌరీ మాణిక్యాంబ వేంకట సుబ్బారావు దంపతులకు O8.12.1931 జన్మించారు, ఈయన తాత గారు పేరుమోసిన పండితుడు శ్రీ  మధునాపంతుల సూరయ్య శాస్త్రి గారు చేళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి గురువు

మధునాపంతుల వేంకట పరమయ్య గారు పెద్దాపురం లోనే విద్యాబ్యాసం చేసి 1959 నుండి 1989 వరకూ పెద్దాపురం లూథరన్ హైస్కూల్ లోనే ఉద్యోగం చేశారు 1950లో సూర్యకాంతం గారిని వివాహం చేసుకున్నారు

తండ్రి మధునాపంతుల సుబ్బారావు గారి ప్రోత్సాహం,  తాత సూరయ్యశాస్త్రి గారి ఆశీస్సులు అందుకుని మామగారు ద్విబాష్యము వేంకటరావు గారి యొక్క ప్రేరణతో కవితారచనకు శ్రీకారం చుట్టి భమిడి సూర్యభగవత్ శాస్త్రి గారివద్ద 1948లో బాషాప్రవీణుడై, సంస్కృత భాషను సంపూర్ణంగా అధ్యయనం చేసి వేద విద్యను అవపోషణపట్టి, వ్యాకరణశాస్త్ర అవలోకనం చేసి సంస్కృతాంద్ర గ్రంధరచనా సామర్థ్యాన్ని ద్విబాషి సోమనాధ శాస్త్రిగారి ద్వారా సముపార్జించి గాంధేయవాది శ్రీ యక్కల వీర్రాజుగారి అపూర్వ సాన్నిహిత్యంలో ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరచుకొని వేదుల సత్యనారాయణ శాస్త్రి సాహిత్య ప్రభావాన్ని కవితా ధోరణిని ఆకళించుకొని నేర్చుకున్న ప్రతీ మంచి విషయాన్ని నిజజీవితంలో పాటించి గొప్ప విద్యార్ధిగా, గొప్ప శిష్యునిగా ఎదిగా విలువలతో కూడిన వ్యక్తి గా జీవించి తను నేర్చుకున్న విద్యను అందరికీ పంచిన గురువుగా ఎందరికో మార్గదర్శకమైన సద్గురుగా ఆద్యాత్మిక ఆనందానికి మార్గాన్ని ప్రభోదించే పరమ పూజ్యులైన గురుదేవులుగా జీవించిన పరమయ్యగారు 07 సెప్టెంబరు 2017 న పరమపదించి శాస్వత నిద్రలోకి జారుకున్నారు :వంగలపూడి శివకృష్ణ

పరమయ్య గారి రచనలు

  • ముద్రితములు

చారుచర్య,

నివేదన,

కుసుమగుచ్ఛము,

ఆంజనేయోదాహరణము,

రచనా విషేషము,

పరమహంసోదాహరణము,

బాలచరితము,

తిరువల్లువరు,

గురుగీతము,

లక్ష్మీ హృదయము,

ఆత్మభోదము,

ముకుందమాల,

విచిత్ర భారతము,

చంద్రోదయము,

పార్వతీ కళ్యాణము,

మల్లికామాలిక,

  • అముద్రితాలు

కబీరు ఉపదేశములు,

నామసుద,

వినాయక చరిత్ర,

దేవీస్తోత్రము,

ప్రేమ ప్రచారకుడు