జె.ఆర్.వనమాలి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
| weight =
}}
'''జగన్నాథరావు వనమాలి''' [[ఢిల్లీ]] [[ఆకాశవాణి]]లో ఒకప్పుడు [[తెలుగు]] [[వార్తలు]] చదివిన ఈయన 'కళావాచస్పతి జగ్గయ్య' సమకాలికుడు.
 
జగన్నాథరావు వనమాలి జె.ఆర్. వనమాలిగా సుప్రసిద్ధుడు. అంచెలంచెలుగా ఎదిగి 20 ఏళ్లక్రితం 'వర్డ్స్ అండ్ వాయిసెస్' అనే సంస్థని ముంబాయిలో స్థాపించాడు. సినినా మరియు ప్రకటన రంగాల్లో ఇప్పుడు నిష్ణాతులుగా పేరుతెచ్చుకున్న ఎందరో కళాకారులకు [[వనమాలి]] తొలి గురువు. థియేటర్ ఆర్ట్స్ రంగంలో 'వాయిస్ ఆర్టిస్ట్'గా [[దాదాసాహెబ్ ఫాల్కే]] అవార్డుని కూడా పొందాడు. 86 ఏళ్ల [[వయసు]]<nowiki/>లోనూ సంస్థని చురుకుగా నడిపిస్తూ ఉన్నాడు.
==జీవిత విశేషాలు==
బాల్యంలో ఆయన [[ఉన్నత పాఠశాల]] చదువుతున్నప్పుడు ఆయన తండ్రి పాకెట్ మనీ ఇచ్చేవారు. వాటితో [[పుస్తకాలు]] కొనుక్కునే వారు. ముఖ్యంగా ముద్దుకృష్ణ 'వైతాళికులు' సంకలనంలో వినాయకరావు, [[రాయప్రోలు సుబ్బారావు]], [[శ్రీశ్రీ]], [[విశ్వనాథ సత్యనారాయణ|విశ్వనాథ]], కృష్ణశాస్త్రిగార్ల[[కృష్ణశాస్త్రి]]<nowiki/>గార్ల కవితలు వీరికి కంఠస్థం. ఆ పుస్తకం ఎప్పుడూ చేతిలోనే ఉండేది. 1944 - 45 ప్రాంతాల్లో [[రాజమండ్రి]] ఆర్ట్స్ కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉండేవారు. వీరికి [[సంగీతం]] మీద కూడా అభిలాష ఉండటంతో హాస్టల్‌లో ఉండే కుర్రాళ్లకి [[పద్యాలు]] పాడి వినిపించే వారు. [[సాహిత్యం|సాహిత్య]]<nowiki/>పరంగా నచ్చిన పద్యాలకి, కవితలకి రాగాలు కట్టి పాడేవారు. ఆ రోజుల్లోనే శ్రీశ్రీ '[[మహాప్రస్థానం]]' పబ్లిష్ అయింది. ఇంట్లోవారు నెల నెల ఇచ్చే పాకెట్ మనీ దాచుకుని ఆ పుస్తకం కొన్నారు. 'మహాప్రస్థానం'లోని కవితలన్నీ వీరికి కంఠస్థమే. ముప్పై పేజీలున్న [[చలం]] 'అమీనా' కూడా మొదట్నించి చివరిదాకా అప్పచెప్పేవారు.
 
==శ్రీశ్రీ పరిచయం==
"https://te.wikipedia.org/wiki/జె.ఆర్.వనమాలి" నుండి వెలికితీశారు