శివాజీ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:డబ్బింగ్ కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
++రాజకీయాల్లో
పంక్తి 6:
 
స్వతహాగా చిరంజీవి అభిమానియైన శివాజీ ఆయన్ను కలవాలని ఆశగా ఉండేది. ఆ కోరిక మాస్టర్ సినిమాతో తీరింది. ఈ సినిమాలో శివాజీ ప్రతిభావంతుడైన క్రీడాకారుడిగా కనిపిస్తాడు. కనీసం బూట్లు కూడా కొనుక్కోలేని పేదరికంలో ఉంటే చిరంజీవి అతన్ని ప్రోత్సహిస్తాడు. నిజజీవితంలో కూడా చిరంజీవి లాంటి పెద్ద మనసున్న వాళ్ళు తనను అలాగే ప్రోత్సహించారని వినమ్రంగా చెబుతాడు శివాజీ. హీరో అవ్వాలనే సినిమా రంగంలోకి రాలేదనీ వైవిధ్యభరితమైన ఏ పాత్ర రూపంలో అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవడానికి సిద్దంగా ఉన్నానని చెబుతాడు. సినిమాల్లో ఆయన తొలి సంపాదన పదిహేను వేల రూపాయలు. [[మాస్టర్]] సినిమాకు పనిచేస్తే వచ్చిన డబ్బులవి. అందరు మధ్య తరగతి కుర్రాళ్ళలానే ఆయన ఆ డబ్బుతో వాళ్ళ అమ్మకు బంగారం కొన్నాడు.
 
== రాజకీయాల్లో ==
భారతీయ జనతా పార్టీలో చేరడంతో శివాజీ రాజకీయాల్లో ప్రవేశించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత, రాష్ట్రానికి [[ప్రత్యేక హోదా|ప్రత్యేక తరగతి హోదా]] సాధించేందుకు కృషి చేసాడు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితిలో చేరి ఉద్యమించాడు. హోదా ఇవ్వనందుకు తన స్వంత పార్టీ భాజపాను విమర్శించాడు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా 2015 మే 3 న గుంటూరులో 48 గంటల నిరాహారదీక్ష చేసాడు.<ref>{{Cite news|url=https://web.archive.org/web/20150508000405/https://timesofindia.indiatimes.com/city/hyderabad/Sivaji-on-hunger-strike-for-Andhra-Pradeshs-special-status/articleshow/47143006.cms|title=Sivaji on hunger strike for Andhra Pradesh's special status|date=2015 మే 14}}</ref> తదనంతర కాలంలో పార్టీకి రాజీనామా చేసాడు.
 
2018 మార్చి 22 న చేసిన ఒక పత్రికా ప్రకటనలో, ఒక జాతీయ రాజకీయ పార్టీ దక్షిణ భారత దేశంలో విస్తరించేందుకు గాను, "''ఆపరేషన్ ద్రవిడ''" అనే కార్యక్రమం చేపట్టిందని, అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌లో "''ఆపరేషన్ గరుడ''"ను నిర్వహిస్తోందనీ చెప్పాడు.<ref>{{Cite news|url=https://web.archive.org/web/20180322174602/http://www.andhrajyothy.com/artical?SID=553596|title=సంచలన విషయాలు బయట పెట్టిన శివాజీ..|date=2018 మార్చి 22}}</ref> <ref>{{Cite news|url=https://web.archive.org/web/20180410042540/https://www.sakshi.com/news/politics/actor-sivaji-tell-story-operation-garuda-1056173|title=శివాజీ చెప్పిన సినిమా స్టోరీ|date=2018 మార్చి 23}}</ref>
 
==శివాజీ నటించిన కొన్ని చిత్రాలు==
 
*[[బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం]] (2010)
*[[మనసుంటే చాలు]]
"https://te.wikipedia.org/wiki/శివాజీ_(నటుడు)" నుండి వెలికితీశారు