శివసాగర్ రాంగులామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 84:
'''శివసాగర్ రాంగులామ్''' మారిషస్ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మానవతావాది. బ్రిటీష్ వలసపాలన నుంచి మారిషస్ ను విముక్తం చేసే ఉద్యమానికి నాయకత్వం వహించడంతో ఆయనను మారిషస్ జాతిపితగానూ భావిస్తూంటారు. మారిషస్ కు స్వాతంత్ర్యం వచ్చాకా తొలి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేశారు. మారిషస్ కు గవర్నర్ జనరల్ గానూ పనిచేశారు.
== తొలినాళ్ళ జీవితం ==
శివసాగర్ రాంగులామ్ మారిషస్ కు చెందిన భారత సంతతి వ్యక్తి. ఆయన తండ్రి మోహీత్ రాంగులామ్ [[బీహార్]]కు చెందిన హరిగావ్ నుంచి మారిషస్ కు వలసవెళ్ళారు. మోహీత్ మారిషస్ లో దారిభత్యానికి కొద్ది రోజుల పాటు కట్టుగా పనిచేయడం ప్రారంభించారు. కార్మికునిగా, మేస్త్రీగా పనిచేసేవారు. అప్పటికే ఇద్దరు పిల్లలుండి, భర్త చనిపోయిన బాస్మతీ రాంచరణ్ ని వివాహం చేసుకున్నారు. వారికి 1900 సంవత్సరంలో శివసాగర్ రాంగులామ్ జన్మించారు. శివసాగర్ మాతృభాష [[భోజ్ పురి]] కాగా [[హిందీ]], [[సంస్కృతం]] వంటి భారతీయ భాషల్లో లోతైన అభినివేశం ఉండేది. హిందూ పురాణాలు, భారతీయ సంస్కృతి తదితర అంశాలపై ఆసక్తి, అవగాహన ఉండేది. పేదకుటుంబంలో జన్మించినా కష్టించి చదివి [[ఇంగ్లండు]] వెళ్ళి వైద్యవిద్యను అభ్యసించి [[వైద్యుడు|డాక్టర్]] అయ్యారు. ఇంగ్లాండులో ఉండగా [[1932]]లో [[రౌండు టేబులు సమావేశాలు|రౌండు టేబులు సమావేశాలకు]] వచ్చిన [[మహాత్మా గాంధీ]]ని కలిశారు. మహాత్మాగాంధీ ఆయనను చాలా ప్రభావితం చేశారు.<ref name="మారిషస్ లో తెలుగుతేజం">{{cite wikisource |title= మారిషస్‍లో తెలుగుతేజం|wslink=మారిషస్‌లో తెలుగు తేజం|last= మండలి|first= బుద్ధప్రసాద్|authorlink= మండలి బుద్ధప్రసాద్|coauthors= |year= |publisher= విదేశాంధ్ర సేవాకేంద్ర|location= హైదరాబాద్|page= |pages= |scan=https://archive.org/stream/MandaliBuddhprasad/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B7%E0%B0%B8%E0%B1%8D%E2%80%8D%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A4%E0%B1%87%E0%B0%9C%E0%B0%82#page/n0/mode/2up}}</ref> అలాగే [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[రాస్‌ బిహారి బోస్‌]] వంటివారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి.
 
== రాజకీయ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_రాంగులామ్" నుండి వెలికితీశారు