35,867
edits
Arjunaraoc (చర్చ | రచనలు) చి |
Arjunaraoc (చర్చ | రచనలు) చి |
||
'''ప్రాణాయామం''' అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం.
ప్రాణాయామం [[మనస్సు]]ను ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. [[పతంజలి]] మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు.
స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపికలో మరియు పాతంజలి యొగశాస్త్రంలో కూడా ప్రాణాయామం చెప్పబడెను.▼
[[File:Tanumânasî kapalabhati.JPG|thumb|300px|right|{{center|ప్రాణాయామం సాధకుడు}}]]
ప్రాణాయామము ముఖ్యముగా త్రివిధములు. 1. కనిష్ఠ ప్రాణాయామము 2. మధ్యమ ప్రాణాయామము. 3. ఉత్తమ ప్రాణాయామము. సాధకులు ప్రథమములో ఉదయం నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని సుఖాసీనులై ఎడమ ముక్కుతో గాలిని నెమ్మదిగా పీల్చి రెండు ముక్కులను బంధించి, కుంభించి, పిమ్మట కుడి ముక్కుతో నెమ్మదిగా వదులుట ఒకటవ ఆవృతము తిరిగి కుడి ముక్కుతో నెమ్మదిగా బాగా గాలిని పీల్చి, కుంభించి, ఎడమ ముక్కుతో చాల నెమ్మదిగా వదిలివేయుట రెండవ ఆవృతము. ఇట్లు ఆరు ఆవృతములతో ఆరంభించి (అనగా ఒక మాత్ర) క్రమముగ పెంచుచు పూటకు 12 ఆవృతములు (రెండు మాత్రలు) చొప్పున మూడు పూటలా 3*12 = 36 ఆవృతములు చేయుట కనిష్ఠ [[ప్రాణాయామము]]. 72 ఆవృతములు చేయుట మధ్యమ ప్రాణాయామము. 108 ఆవృతములు చేయుట ఉత్తమ ప్రాణాయామము.
ప్రాణాయామం ముఖ్యంగా [[ఎనిమిది]] రకాలు. ఇవి [[అష్టకుంభకాలు]].
===
సూర్య భేదనం అనగా సూర్య నాడిని ఉద్ద్దీపన చేయుట
కపాలమును శోధించును. ఉదరగతమైన వాత; క్రిమిదోషములు హరించును. శ్వేద, స్నేహ, గ్రంథులను ఉజ్జీవింపజేయును. ప్రాణ శక్తిని పెంచును. ఫలితమెక్కువగా ఉన్న ఈ సుర్య భేదన ప్రాణాయామమును తరుచు చేయుట మచిది.
===
ఉజ్జాయి అనగ ఛిన్నపిల్లల గురక ద్వణి లాగ గాలిని ముక్కుద్వారా తీసుకొనువలెను.ఆసమయములో గొంతుక వద్ద ద్వని నెమ్మదిగ చేయవలెను.
ఇది ముఖ్యముగ శ్లేష్మ రోగులకు మంచిది. ఉబ్బసముచే బాధపడువారు తరచు ఉజ్జాయినీ చేయుట చాలా మంచిది. ఇది ఆయాసపడేవారు నిలబడి గూడా చేయవచ్చును. వెన్నుపామును, మెడను వంగకుండ నిగిడ్చి ఉంచుట మంచిది. శ్లేష్మ ప్రకోపముతో వచ్చు జలదోషములు, వ్యాధులు-జలోధరం, కాళ్ళకు నీరువాపులు గలవారుకూడ చేయుట మంచిది.
===
[[చేయువిధానము]]
ఇది ముఖ్యముగ అలసత్వము (Dullness) తగ్గును. బలము ముఖ వర్చస్సు పెరుగును. దేహమునందు దుష్టవేడి తగ్గును.
===
శీతలి అనగా చల్లదనము.
ఇది ముఖ్యముగ అతివేడిని, పిత్తవికారములను తగ్గించును. విదాహమును, విషములను అరికట్టును, గాయములను మానుపును. చేయుట సులభము. ఫలితము ఎక్కువ. పాము-తేలు కాట్లకు, దెబ్బలు, గాయాలకు మేలు చేయును. అంతేగాక ఎక్కిళ్ళను అబద్భుతముగ అరికట్టును.
===
భస్త్రిక అనగ తొలుతిత్తి.
త్రిదోషములను సమరస పరచును. కఫాలము - సప్తపదలయందుగల దోషములను- కఫములను వెలువరించును. హరించును. కుంభకవ్యవధిని పెంచును. శ్లేష్మ గతములైన ముక్కు దిబ్బడ, జలుబు, తుమ్ములు, ఎలర్జీ, సైనోసెటీస్ లాంటి వ్యాధులను నివారించును. సుషుమ్నా నాడిని శుద్ధిచేసి కుండలినీ శక్తిని మేలుకొల్పును.
===
భ్రామరి అనగా తుమ్మెద.
సుశబ్దముచే చిత్తము రంజిల్లును. శరీరము వేడెక్కుచు చల్లబడుట వలన సుఖముగా నుండును.
===
మూర్ఛ అనగా మతిభ్రమించుట. గ
చర్మదోషములుతొలగి, శరీరము కాంతివంతమగును. ప్రాణశక్తి పెరుగును.
===
ప్లావని అనగా తేలుట .
నోటితో గాలిని కొంచెం, కొంచెంగా పీల్చుకొంటూ కడుపులోనికి మింగుచుండవలెను. బాగుగా పొట్టనిండా గాలి చేరి, పొట్ట వుబ్బిన తరువాత ( ఈ స్థితిలో పొట్టపైన కొడితే ఢమరుకమువలె మోగును) కుంభించి తిరిగి నెమ్మదిగ, నెమ్మదిగ - నోటితోగాని - ముక్కులతోగాని గాలిని వెలువరించవలెను. ఇది చాలా శ్రమతో గూడిన విధానము కనుక గురు ముఖతా అభ్యసించుట మంచిది.
ఇది బాగుగా అభ్యాసమైన వారికి శరీరమును నీటిపై తెప్పవలె తేల్చుటకు ఎంతగానో ఉపకరించును. నీటిపై వెల్లకిల పరుండి పద్మాసనము వేసి గాలిని కడుపునిండా కుంభించుటవలన్ శరీరము నీటిపై తేలిపోవును. ప్రవాహము గల కాలువలో వేస్తే శవము వలే తేలి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళవచ్చునని పెద్దలు చెప్పుదురు.
▲స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపికలో మరియు పాతంజలి యొగశాస్త్రంలో కూడా ప్రాణాయామం చెప్పబడెను.
==వనరులు==
{{మూలాలజాబితా}}
|