బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 68:
=====హైదరాబాదు సంస్థానము=====
అసఫ్ జాహి వంశమువాడొకడైన [[నిజాం ఉల్ముల్కు]] అను నవాబు మొగల్ సామ్రాజ్య ప్రతినిధిగ 1713 నియమించబడ్డాడు. ఔరంగజీబు మరణానంతరము క్రమేణా మొగలాయి సామ్రాజ్య క్షీణంచుచుండిన రోజులలో అతను కూడా స్వతంత్ర రాజుగ పరిపాలన సాంగించెను. 7తరాల తరువాత వారసుడైన అతని సంతతివాడు [[మీర్ ఊస్మాన్ అలిఖాన్]] బ్రిటిష్ సామ్రాజ్య నిష్క్రమణ ప్రయత్నములు జరుగుతున్న 1947 నాటికి హైదరాబాదు నిజాముగా ఆ సంస్థానమును పరిపాలించుచుండెను. అప్పటి ప్రపంచములో కల్లా గొప్ప ధనికుడని పేరుపొందియుండి, బ్రిటిష్ ప్రభువుల కొలువులో పలుకుబడి గల్గియుండినవాడు. 85శాతం జనాభా హిందువులుకలిగియుండి ఆస్ట్రేలియా దేశముంతటి (జనాభా సంఖ్యవారీ) హైదరాబాదు సంస్థానమునకు ప్రత్యేక పార్లమెంటు, కంరెన్సీ(మారక ద్రవ్యము), సైనికబలగము యుండియున్నది. [[ఉత్తర సర్కారులు]] అనబడిన రాజ్యభాగమును(రాజమండ్రినుండి మచిలీ పట్టణం దాకా) వారికి చక్కబెట్టిన నిజామునకు, అతని సంస్థానమునకు బ్రిటిష్ ప్రభువులు చాల ప్రాముఖ్యతనిచ్చియుండిరి. 1947 జనేవరి నుండి అతి వేగముగ నెలకొంటున్న రాజకీయ పరిస్థితులలో హైదరాబాదు నిజాంగారి అభిమాన పాత్రులు, మిత్రులైన బ్రిటిష్ అధికారులు బ్రిటిష్ సామ్రాజ్య నిష్క్రమణతో భారతదేశములోని అనేక స్వతంత్రరాజ్యములు స్వతంత్ర దేశములగా పరిగణింపవలెనన్న ధోరణి ప్రవేశ పెట్టిరి. ఉన్నత జీతబత్తెములపై నిజాం నియమించుకున్నరాజకీయ సలహాదారుడు సర్ వాల్టర్ మాంక్టన్ దొర నిజాం తరఫున హైదరాబాదు సంస్థానము బ్రిటిష్ వారి మిత్రరాజ్యమనియు చాల చక్కగా పరిపాలించిన కరవు రహితమైన రాజ్యమనియు, భారతదేశములో విలీనమైనచో నిజాము రాజ్యములోనున్న ముస్లిం జనాభా తిరుగుబాటు చేయుదురనియు బ్రిటిష్ సామ్రాజ్య ప్రతినిధి వైస్రాయి మౌంటుబాటన్ కాంగ్రెస్సువారి చెప్పుచేతలలోనుండబట్టి నిజామున కన్యాయము జరుగు చుండెనని బ్రిటిష్ పార్లమెంటు విపక్ష రాజకీయనాయకుల అనురాగము పొందుటకు ప్రయత్నించెను. తమ అభిమానపాత్రుడు, మిత్రుడైన నిజామును అవసరసమయములో విడనాడకుండ చేయూత నియ్యవలసిన సమయమని బ్రిటిష్ విపక్షనాయకుడైన చర్చిల్ వ్యాఖ్యానములు చరిత్రలోకెక్కినవి. పాకిస్తాన్ అధినేత జిన్నాహ పాకిస్తాన్లో చేరమని నిజామును ప్రేరేపించెనప్పటికినీ తన రాజ్యము బారతదేశముతోగానీ, పాకిస్తాన్ తోగానీ చేరక స్వతంత్ర డొమినియన్గ నుండునని జూన్ 3 తారీకునాటికే ఫర్మానా విడుదల చేసియుండెను గానీ చివరగా నిజాము కొంత మెత్తబడి హైదరాబాదు సంస్థానముయొక్క విదేశవ్యవహారములు, రక్షణ, సమాచార- ప్రచారములు భారతదేశకేంద్ర ప్రభుత్వమున కప్పచప్పుటకు సంసిద్దుడైననూ భారతదేశములో చేరిపోవుటకు మాత్రము నిరాకరించెను.
=====జమ్మూ-కాశ్మీర సంస్థానము=====
సశేషం
 
==స్వదేశ సంస్థానములు భారతడొమినీయన్లో విలీనమగటకు వైస్రాయి మౌంటుబాటన్ చేసిన కృషి==