ఘంటా గోపాల్‌రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఘంటా గోపాల్‌రెడ్డి''' వ్యవసాయ రంగశాస్త్రవేత్త మాంత్రికుడు,మరియు ఉమ్మడి [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌]]<nowiki/>లో ఎత్తిపోతల పథకాల సృష్టికర్త.
 
 
== జీవిత విశేషాలు ==
గోపాల్‌రెడ్డి [[1932]] [[ఫిబ్రవరి 14]]<nowiki/>న నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం [[గడ్డంపల్లి (పినపాక)|గడ్డిపల్లి]]<nowiki/>లో జన్మించాడు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో 1948-52 వరకు వ్యవసాయ విద్యనభ్యసించాడు. అనంతరం నల్లగొండలో వ్యవసాయ విస్తరణాధికారిగా కొంతకాలం సేవలందించాడు. 1958లో అమెరికాకు వెళ్లిన గోపాల్‌రెడ్డి 1960-64 వరకు అగ్రికల్చర్ పీజీ పూర్తిచేసి, 1969లో పీహెచ్‌డీ పూర్తిచేశాడు.<ref>{{Cite news|url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/ex-minister-rajagopala-reddy-passes-away-1-2-572037.html|title=వ్యవసాయ శాస్త్రవేత్త గోపాల్‌రెడ్డి కన్నుమూత|access-date=2018-04-15}}</ref> 1964 నుంచి 1969 వరకు [[హైదరాబాదు|హైదరాబాద్‌]]<nowiki/>లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించాడు. [[నాగార్జునసాగర్|నాగార్జునసాగర్‌]] ఎడమకాలువ తవ్వకాల సమయంలో కాలువకు ఎగువ భాగంలోని బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు సుదీర్ఘంగా పోరాటం చేశాడు. 1969లో మహాత్మాగాంధీ ఎత్తిపోతల నిర్మాణానికి కృషిచేశాడు. ఈ పథకాన్ని ఏర్పాటుచేసి రైతుల బీడు భూముల్లో పంట సిరులు కురిపించాడు. దీని నిర్మాణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తిపోతల సృష్టికర్తగా ఆయన మన్ననలు అందుకున్నాడు. రైతులకు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో శిక్షణలు ఇప్పించాడు. పలు కొత్త వంగడాలను ఆయన సృష్టించారు.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=564538|title=వ్యవసాయ మాంత్రికుడు గోపాల్‌రెడ్డి కన్నుమూత -|website=www.andhrajyothy.com|access-date=2018-04-15}}</ref> శ్రీమాతృకృపా గడ్డిపల్లి అభ్యుదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 1984-85లో గడ్డిపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పారు.
 
 
== మరణం ==
కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గోపాల్‌రెడ్డికి భార్య రత్నమాల, ఇద్దరు కుమార్తెలు లక్ష్మి, మీరా, కుమారుడు అజిత్‌రెడ్డి ఉన్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఘంటా_గోపాల్‌రెడ్డి" నుండి వెలికితీశారు