మహాత్మా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraoc (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2335796 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 96:
[[దస్త్రం:Raj ghat.jpg|right|500pix|thumb|[[రాజ్ ఘాట్]]]]
=== గాంధీ హత్య ===
1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను [[నాథూరామ్ గాడ్సే]] కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన మాటల ప్రకారం"1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ [[ఢిల్లీ]]<nowiki/>లోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అఛాఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కలిగిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు. కానీ ఆ సమయంలో బాపు ‘హేరాం’ అని ఉచ్ఛరించలేదు.<ref>{{cite web|url=http://www.mkgandhi.org/last%20days/glastday.htm |title=The Last Day Of Mahatma Gandhi|publisher=mkgandhi.org |date=|accessdate=2014-01-31}}</ref><ref>{{cite web|url=http://www.sakshi.com/news/top-news/gandhi-did-not-said-hey-ram-says-his-the-then-secreraty-101515?pfrom=home-top-story |title=గాంధీ 'హేరాం' అనలేదు|publisher=Sakshi |date= 2014-1-30|accessdate=2014-01-30}}{{dead link|date=April 2018}}</ref> గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయారు." గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో గాంధీ హేరాం అంటూ నేలకొరిగారనే సమాచారాన్ని ఇచ్చారు. గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లాయి.
 
ఢిల్లీ రాజఘాట్ లో అతని సమాధి మరియు స్మారక స్థలమైన [[రాజ్ ఘాట్]] వద్ద ఈ మంత్రమే చెక్కి ఉన్నది. మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ [[జవహర్ లాల్ నెహ్రూ]] రేడియోలో అన్న మాటలు: "మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించి, చీకటి అలుముకొన్నది. ఏమి చెప్పటానికీ నాకు [[మాటలు]] కరవయ్యాయి. మన జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించడు. మనను ఓదార్చి, దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకూ, కోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము".
"https://te.wikipedia.org/wiki/మహాత్మా_గాంధీ" నుండి వెలికితీశారు