భారత ప్రభుత్వ చట్టం - 1935: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి (7), నుండీ → నుండి (7) using AWB
పంక్తి 4:
1931 మార్చిలో జరిగిన [[గాంధీ-ఇర్విన్ సంధి]] బ్రిటిష్ సార్వభౌమత్వమునకు అవమానమైనదని, భారతదేశములో స్వతంత్రోద్యమమును, కాంగ్రెస్ పార్టీని అతిస్వల్పకాలములోనే అణచి తుడిచిపెట్టగలనన్న నమ్మకము కలవాడునూ, సామ్రాజ్యతత్వవాదైనట్టి [[లార్డు విల్లింగ్డన్]] వైస్రాయిగా ( [[లార్డు ఇర్విన్]] తర్వాత) పదవిచేపట్టి నిరంకుశముగా నిషేధాజ్ఞలు విధించుతూ 1931 సంవత్సరమునుండి భారతదేశమును పరిపాలించసాగెను. అతనికి చేదోడుగా ఇంగ్లండు లోని ఐరోపాసంఘము వారు భారతదేశములో ప్రబలుచున్న స్వరాజ్యకాంక్ష, అందుకు ప్రోద్బలించుచున్న కాంగ్రెస్సుపార్టీ, వారి స్వరాజ్యాందోళనోద్యమముల నణిచివేయుటకు అవలంబింపవలసిన నిర్భందవిధానముల ప్రణాళికను కూడా ప్రకటించిరి. అట్టి నిర్దుష్ట పరిస్థితులందుకూడా మాటతప్పని గాందీజీ గాంధీ-ఇర్విన్ సంధి వప్పందమునకు కట్టుబడియుండి ఆ సంధి ప్రకారము [[రెండవ రౌండ్ టేబుల్ సభ]]లో పాల్గొనెను. కాని ఆ సభయందు బ్రిటిష్ ప్రభుత్వమువారు తమ వైఖరిని బయట పెట్టక సభను ముగింపచేసిరి. గాందీజీ 1931 డిసెంబరులో ఇంగ్లండునుండి తిరిగివచ్చి దేశ రాజకీయ పరిస్థితుల పై వైస్రాయితో సంప్రతింపులచేయటకు సమయము కోరగా నిరాకరించబడెను. 1932 లో ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరును జైలుకంపించబడిరి, కాంగ్రెస్సు సంస్ధలు అవైధానికమని (అశాసనీయము; illegal) అని ప్రకటించబడెను. లార్డు వెల్లింగటన్ చేసేటటువంటి అనేక నిర్ధుష్టమైన నిషేధాజ్ఞలను అప్పటి శాసనసభలలోనుండిన ప్రభుభక్తులు శాసనములుగా చేయసాగిరి. ఒకప్రక్కన నిరంకుశ నిషేధాజ్ఞలు, నిర్భంధ విధానములతో అతి క్రూరముగా అమలుచేయుచున్న పోలీసులు చర్యలవల్ల చెరసాలలోమగ్గుతున్నవారు, లాఠీ దెబ్బలతో అంగవైకల్యములు కలిగినవారు, ప్రాణాలు పోగొట్టుకున్నవారు అనేకులుంటూవుండగా వైస్రాయి వెల్లింగటన్ కాంగ్రెస్ వారి ఆందోళనోద్యమములు అణిచిపోయినవని ఇంగ్లండు లోని బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వమువారికి నచ్చచెప్పుచుండెను. అట్టి పరిస్థితులలో బ్రిటిష్ సామ్రాజ్య ప్రభుత్వమువారు భారతదేశమున కొత్త రాజ్యాంగ విధానమును ప్రవేశపెట్టుటకు విచారణలు జరుపుదుమని [[మూడవ రౌండ్ టేబుల్ సభకు]] కాంగ్రెస్ నాయకులనాహ్వానించిరి. కాని కాంగ్రెస్ ప్రభ్రుతులు ఆ రౌండ్ టేబుల్ సభలో పాల్గొన నిరాకరించగా బ్రిటిష్ ప్రభుభక్తులకొందరను ఆహ్వానించి చర్చలు జరిపి వారు చేయదలచిన రాజ్యాంగవిధానమునకు 1933లో వైటపేపర (White Paper) అనబడు ప్రణాలికను ప్రకటించిరి. ఆ ప్రణాలికలో సూచించబడిన రాజ్యాంగవిధానము దేశ ప్రజలకు రాజకీయనాయకులకు తీవ్ర అశాభంగముగానుండినది. అందుచే ఆ ప్రణాలికను చర్చించుటకు [[లార్డు లిన్ లిత్గొ]] అద్యక్షతన నొక పార్లమెంటు సంఘమునింయమించి అందు భారతీయ ప్రముఖులుకొందరిని సభ్యులుగచేసి కొన్ని సవరణలు చేసి ( ప్రభుత్వపు నిరంకుశ అధికారములను కొంచం పల్చబరచి) ఒక నివేదిక తయారిచేసి దాని ప్రకారము చిత్తు చట్టమును పార్లమెంటులో ప్రవేశ పెట్టి చివరకు 1935లో చట్టరూపముగా బ్రిటిష్ పార్లమెంటు వారి ఆమోదముపొందిన తరువాత ఆ చట్టము 1935 డిసెంబరు నెలలో భారతదేశానికి నూతన రాజ్యాంగముగా చేయబడి 1937 ఏప్రిల్ 1 వ తేదీనుండి రాష్ట్రములలో అమలు చేయదలచి బ్రిటిష్ ప్రభుత్వము తగు సన్నాహములు చేయసాగెను.<ref name="D.V. Siva Rao (1938)">"The British Rule in India" D. V. Siva Rao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షరశాల, బెజవాడ pp 414-426</ref>
=== నూతన రాజ్యాంగమబ్బిన తరువాత చరిత్రాంశములు(1936-1937), రాష్ట్రములలో కాంగ్రెస్స్ ఫ్రభుత్వ స్థాపన ===
బ్రిటిష్ ప్రభుత్వము వారు క్రొత్త రాజ్యాంగమును 1937 ఏప్రిల్ 1 వ తేదీనుండి అమలుచేయుటకు తగు సన్నాహములు చేయుచుండగా ఇచ్చట కాంగ్రెస్సు నాయకులు గాందీజీ నాయకత్వములో ఆ నిర్దుష్ట రాజ్యాంగమును విఫలము చేయుటకు శాస్త్రయుతమైన శాంతియుత విధానము నవలంబించిరి. భారతదేశములో జాతి మత వైషమ్యాల వల్ల ప్రజాతంత్రము నడువసాగదని భ్రిటిష్ వారి అంచనా. భారతదేశమునకు బ్రిటిష్ ప్రభువులిచ్చు కేంద్రీకృతముగనుండెడి కొత్తరాజ్యాంగములో తాముకూడా భాగీదారులుగ నుండుటకు స్వదేశ సంస్థానప్రతినిధులు 1932 లో జరిగిన రెండవ రౌండు టేబుల్ సమావేశములో తమ సమ్మతి తెలిపిరి. అది బ్రిటిష్ ప్రభువులకణుగమైన సమ్మతి. స్వదేశ సంస్తానాధీశులందరు నిరంకుశ పరిపాలకులైయుండినందున వారి సంస్థానములలో శాసనసభలునెలకొల్పు రాజ్యాంగము భారతదేశమునకిచ్చి ప్రజాపరిపాలనా పధ్దతి నెలకొలిపితిమనిపించుకునిరి.చూడు [[బ్రిటిష్ సామ్రాజ్యము భారతదేశమునుండి నిష్క్రమించేనాటి స్వదేశ సంస్థానాధీశుల నిర్ణయములు]] ( దానికి తగట్టుగనే బ్రిటిష్ వారు 1909సంవత్సరపు సంస్కరణలో ([[మింటో-మార్లే సంస్కరణలు]]) అల్పసంఖ్యలకనిచెప్పి మహ్మదీయులకే కాక ఇతర వర్గములవారికినీ ప్రత్యేక నియోజక వర్గములు నెలకొల్పి జాతి మతవైషమ్యాలను పెంపొందిచే (విభజించి పరిపాలించమన్న సూత్రము తో) ప్రభుత్వ పరిపాలన సాగించుచుండిరి. 1919 సంవత్సరములో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణల ([[మాంటేగు-షెమ్సఫర్డు రాజ్యాంగ సంస్కరణ చట్టము]]) వల్లనెలకొలపబడ్డ కేంద్ర, రాష్ట్ర శాసన సభల లోని సభ్యులందరూ కాంగ్రెస్సు పార్టీకి చెందనందున ఏకీకృతాభిప్రాయములేక నిశ్చిత తీర్మానములు చేయబడుట లేదనీ అప్పటికి 1937 ఫిబ్రవరిలో వచ్చిన ఎన్నికలలో కాంగ్రెస్సు సభ్యులు అధిక సంఖ్యలో రాజాలరని బ్రిటిష్ ప్రభుత్వ అంచనాను విఫలము చేయ కాంగ్రెస్స్ నాయకత్వము నిశ్చయించారు. అందుకణగుణముగా యావద్భారతదేశములోని అన్ని రాష్ట్ర శాసససభలకూ (1937 నాటి 11 రాష్ట్రములు) కాంగ్రెస్సు సభ్యులు అధిక సంఖ్యలో పోటీచేసి ఏన్నికలలో ఏడురాష్ట్రములలో అధిక ఓట్లతో ఘనవిజయము సాధించి కాంగ్రెస్సు ప్రభుత్వోదయము చేసి ఫ్రబుత్వమువారి అంచనాలకు విరుధ్దమగు ఫలితములు కలుగచేసిరి. అయితే క్రొత్తగా వచ్చిన రాజ్యాంగములో గవర్నర్ జనరల్ కు, రాష్ట్ర గవర్నర్లకు నిరంకుశమైన విశేషాధికారములు యధావిధిగా అమలులోనుండబట్టి ప్రజాభిప్రాయము, రాజ్యాంగ మర్యాదకి స్థానములేక శాసనసభలు, మంత్రుల నిర్ణయాలు త్రోసిబుచ్చబడగలవు. అందుచే ప్రజాపరిపాలన విషయములో గవర్నర్లు, గవర్నర్ జనరల్ ఆటంకములు పెట్టరను ఆశ్వాసనము ఇచ్చే వరకూ తమ మంత్రులు పదవులు చేపట్టగూడదను ఒక తీర్మానము 1937 మార్చిలో కాంగ్రెస్సు మహాసభలో చేయబడెను. కొంత నిరాకరణ, విముఖత చూపి ఎట్టకేలకు 1937 జూలై మాసములో బ్రిటిష్ ప్రభుత్వము వారు మెట్టు దిగివచ్చి కాంగ్రెస్సు వారికి తగు ఆశాస్వన మిచ్చిన తరువాత కాంగ్రెస్సు మంత్రులు పదవీ స్వీకరించి ఆ ఏడు రాష్ట్రములలో ప్రజాపరిపాలన మొదలుపెట్టిన తరువాత భారతదేశములో నూతన యుగము ఆరంభమైనదని చెప్పవచ్చును.<ref name="D.V. Siva Rao (1938)" />. కానీ దాదాపు 200 సంవత్సరముల బ్రిటిష్ పరిపాలనక్రిందయుండుటవలన 1947 తరువాతగూడా స్వతంత్ర భారతదేశములో బ్రిటిష్ ప్రభుత్వపరిపాలనా విధానము ఒకనమూనాగా నిలచిపోయినటుల కనబడుచున్నది. 1935 సంవత్సరపు ఇండియా రాజ్యాంగచట్టమే పరిణామములతో స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగమైనదని అనడములో ఆశ్చర్యములేదన్నాడు ప్రముఖ చరిత్రకారుడు [[బి.కె. నెహ్రూ]].<ref name="Ethnonationalism">"Ethnonationalism in India" Edited by Sanjib Baruah (2012) Oxford India Paperback.Critical issues in Indian Politics. pp 139,406</ref>
 
==చట్టము ద్వారా కలగిన నూతనరాజ్యాంగ వివరములు==