ప్రేమ ఖైదీ: కూర్పుల మధ్య తేడాలు

2,125 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
చంద్రం అనే 21 ఏళ్ళ యువకుణ్ణి తండ్రిని హత్య చేసిన నేరం కింద జైలుకి తీసుకురావడంతో కథ ప్రారంభమవుతుంది. వచ్చీ రాగానే తోటి ఖైదీలు అతనితో గొడవ పెట్టుకుంటారు. జైలు గోడమీద చంద్రం ఓ అమ్మాయి బొమ్మ వేస్తాడు. దాన్ని గురించి జైలరు నీచంగా మాట్లాడితే అతన్ని కూడా కొడతాడు. జైలరు జైలులో ఉన్న ఖైదీలను అక్రమంగా బయటకు పంపించి దారి దోపిడీలు చేయిస్తుంటాడు. ప్రభావతి అనే లేడీ ఆఫీసరు బోస్టన్ స్కూలుకి సూపరింటెండెంటు గా వస్తుంది. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న చంద్రాన్ని ఆసుపత్రికి తరలించమంటుంది. ఈ లోపున నీలిమ అనే అమ్మాయి చంద్రాన్ని చూడటానికి జైలుకి వస్తుంది కానీ పోలీసులు అనుమతించరు. ఈ లోపున ఆమె తండ్రి పంపించిన మనుషులు ఆమెను బలవంతంగా తీసుకెళ్ళబోతే చంద్రం వారి వెంట పడతాడు కానీ మళ్ళీ పోలీసులకు చిక్కి ఆసుపత్రిలో చేరతాడు. కానీ కొంతమంది గూండాలు వచ్చి అతన్ని చంపబోతే ప్రభావతి వచ్చి వారిని అడ్డుకుంటుంది. ప్రభావతి చంద్రం గురించి ఆరా తీయగా తన కథ గురించి చెబుతాడు.
 
బాపినీడు అనే వ్యక్తి చేపలు వ్యాపారం చేస్తుంటాడు. అతని దగ్గర చంద్రం తండ్రి పనిచేస్తూ రెండు కాళ్ళు పోగొట్టుకుంటాడు. కుటుంబం గడవడం కోసం చంద్రం వారింట్లో గుమాస్తాగా చేరతాడు. అక్కడే అతనికి బాపినీడు కూతురు నీలిమ పరిచయం అవుతుంది. నీలిమ మొదట్లో స్నేహితురాళ్ళతో పందెం కాసి చంద్రాన్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది. కానీ తర్వాత అతని మంచితనం గురించి తెలుసుకుని నిజంగా ప్రేమించడం మొదలుపెడుతుంది. కానీ బాపినీడు వారి ప్రేమను అంగీకరించడు. చంద్రాన్ని చంపమని గూండాలని పురమాయిస్తాడు. కానీ వాళ్ళు పొరపాటున చంద్రం తండ్రిని చంపేసి ఆ నేరాన్ని చంద్రం మీద వేస్తారు. ప్రభావతికి చంద్రం మీద జాలి కలిగి వారిద్దరి పెళ్ళి తాను చేస్తానని మాట ఇస్తుంది. నేరుగా బాపినీడు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయమని చెబుతుంది. బాపినీడు ఆమెను అవమానించి పంపించేస్తాడు. ప్రభావతి బాపినీడుకు తెలియకుండా జైల్లో ఉన్న చంద్రం, నీలిమ కలిసే ఏర్పాటు చేస్తుంది. బాపినీడు నీలిమను ఓ వ్యాపారవేత్త కొడుక్కిచ్చి పెళ్ళి చేయబోతే ఆమె మైనర్ అని నిరూపించి ఆ పెళ్ళిని ఆపుచేయిస్తుంది ప్రభావతి. ఆమె మీద కక్షతో ప్రభావతి కొడుకుని అన్యాయంగా జైలుకి పంపిస్తాడు బాపినీడు.
 
==తారాగణం==
33,853

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2338596" నుండి వెలికితీశారు